Mission Chapter 1 OTT: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న అమీ జాక్స‌న్ రీఎంట్రీ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌-amy jackson mission chapter streaming on netflix from this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Amy Jackson Mission Chapter Streaming On Netflix From This Date

Mission Chapter 1 OTT: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న అమీ జాక్స‌న్ రీఎంట్రీ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 25, 2024 03:00 PM IST

Mission Chapter 1 OTT: కోలీవుడ్ మూవీ మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్‌తో దాదాపు ఆరేళ్ల గ్యాప్ త‌ర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది అమీజాక్స‌న్‌. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

మిష‌న్ ఛాప్ట‌ర్ 1 ఓటీటీ
మిష‌న్ ఛాప్ట‌ర్ 1 ఓటీటీ

Mission Chapter 1 OTT: రామ్‌చ‌ర‌ణ్ ఎవ‌డులో గ్లామ‌ర్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది బ్రిట‌న్ బ్యూటీ అమీ జాక్స‌న్‌. ప్రేమ‌వ్య‌వ‌హారంతో పాటు త‌ల్లిగా మారిన అమీజాక్స‌న్ ఆరేళ్ల పాటు సినిమాల‌కు దూర‌మైంది. హీరోయిన్‌గా అమీ జాక్స‌న్‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కోలీవుడ్ మూవీ మిష‌న్ చాఫ్ట‌ర్ వ‌న్‌తో లాంగ్ గ్యాప్ త‌ర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ యాక్ష‌న్ మూవీలో అరుణ్ విజ‌య్ హీరోగా న‌టించాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో ఈ మూవీ రిలీజైంది.

తెలుగులో రిలీజ్ కావాల్సింది....

త‌మిళంతో పాటు తెలుగులోనూ సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ అనుకున్నారు. కానీ తెలుగులో సంక్రాంతికి నాలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ కావ‌డంతో థియేట‌ర్ల స‌మ‌స్య కార‌ణంగా మిష‌న్ చాఫ్ట‌ర్ వ‌న్ కేవ‌లం త‌మిళంలో మాత్ర‌మే రిలీజైంది. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ మూవీని నిర్మించింది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌...

మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ యాక్ష‌న్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. మార్చి 1న ఈ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు స‌మాచారం. త‌మిళంతో పాటు తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్‌లో మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు.

తెలుగులో ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. త‌మిళ వెర్ష‌న్ రిలీజైన వారం రోజుల త‌ర్వాత తెలుగులో రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ త‌మిళ వెర్ష‌న్ క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిల‌వ‌డంతో తెలుగు రిలీజ్‌పై ఎఫెక్ట్ ప‌డింది. దాంతో నేరుగా మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ తెలుగు వెర్ష‌న్ ఓటీటీలోకే రాబోతోంది.

ఖైదీ పోరాటం...

తండ్రి కూతుళ్ల ఎమోష‌న్‌కు యాక్ష‌న్ అంశాల‌ను మేళ‌వించి ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ మిష‌న్ ఛాప్ట‌ర్ 1ను తెర‌కెక్కించాడు. హాస్పిట‌ల్‌లో ప్రాణాల‌తో పోరాడుతోన్న త‌న కూతురుని క‌లుసుకోవ‌డానికి జైలులో ఉన్న ఖైదీ ఎలాంటి పోరాటం చేశాడు? విదేశీ జైలులో అత‌డు ఖైదీగా మార‌డానికి కార‌ణం ఏమిటి అన్న‌దే ఈ మూవీ క‌థ. ఇందులో అమీజాక్స‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించింది. ఈ సినిమాలో అమీజాక్స‌న్‌తో పాటు నిమిషా స‌జ‌య‌న్ మ‌రో హీరోయిన్‌గా క‌నిపించింది.

ర‌జ‌నీకాంత్ రోబో...

త‌మిళంలో విక్ర‌మ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఐ మూవీతో అమీజాక్స‌న్ తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. ఆ త‌ర్వాత ద‌ళ‌ప‌తి విజ‌య్ తేరీలో ఓ హీరోయిన్‌గా క‌నిపించింది. ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌ల్లోనే క‌నిపించింది. రోబో 2 మూవీలో ర‌జ‌నీకాంత్‌తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది.

జార్జ్ ప‌నాయెట్టు అనేబిజినెస్‌మెన్‌తో ప్రేమ‌లో ప‌డిన అమీజాక్స‌న్ ఆ త‌ర్వాత ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప‌నాయోట్టును అమీజాక్స‌న్ పెళ్లాడ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా అత‌డితో బ్రేక‌ప్ చెప్పిన అమీజాక్స‌న్ ఇటీవ‌లే ఎడ్ వెస్ట్‌విక్ అనే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ను పెళ్లాడ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

IPL_Entry_Point