Konaseema Thugs: అమ్మవారి ఉగ్రరూపాన్ని చూపించే కోనసీమ థగ్స్.. పాట చూస్తే గూస్ బంప్సే..!-amman song released from the movie konaseema thugs ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Amman Song Released From The Movie Konaseema Thugs

Konaseema Thugs: అమ్మవారి ఉగ్రరూపాన్ని చూపించే కోనసీమ థగ్స్.. పాట చూస్తే గూస్ బంప్సే..!

కోనసీమ థగ్స్ నుంచి మొదటి పాట విడుదల
కోనసీమ థగ్స్ నుంచి మొదటి పాట విడుదల

Konaseema Thugs: ప్రముఖ కొరియోగ్రాఫర్ బందా గోపాల్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కోనసీమ థగ్స్. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ పాట ప్రేక్షకులను గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది.

Konaseema Thugs: కాంతార సినిమా ప్రభావంతో తెలియని సంస్కృతి, సంప్రదాయాలపై ప్రజలకు ఎక్కువగా ఆసక్తి ఏర్పడుతోంది. ముఖ్యంగా సినిమాలో కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా సినిమాను ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముక డ్యాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకురాలిగా మారి ప్రయోగాత్మక చిత్రానికి దర్శకత్వం వహించారు. అదే థగ్స్. తెలుగులో ఈ సినిమాను కోనసీమ థగ్స్ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నుంచి విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు

అమ్మవారు కాళికా రూపంలో ఊరేగింపుగా వచ్చే సన్నివేశం బ్యాక్ డ్రాప్‌లో ఈ పాట గూస్ బంప్స్ తెప్పిస్తోంది. వీర శూర మంహకాళి వస్తోందయ్య.. వేటాడను ఆ తల్లే వస్తొందయ్యా.. అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. పిక్చరైజేషన్, నృత్యాలు, విజువల్స్ అన్నీ ఆకర్షణీయంగా ఉన్నాయి. అమ్మవారు పూనినట్లు హృదు చేసిన నృత్యం, కొరియోగ్రఫీ ఆకట్టుకుంటాయి. శామ్ సీ ఎస్ అమ్మ ఉగ్రరూపాన్ని ఎలివేట్ చేసే విధంగా ఎనర్జిటిక్ ట్యూన్ ఇచ్చారు. ప్రముఖ గీత రచయిత వనమాలి అదిరిపోయే సాహిత్యాన్ని అందించారు.

అమ్మవారు క్రోధం తెలిసేలా ఈ పాట సాహిత్యాన్ని వనమాలి రాశారు. కాలభైరవ తన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ సాంగ్‌పై విశేషంగా స్పందిస్తున్నారు.

ఈ సినిమా ద్వారా హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతండగా.. సింహా, ఆర్ కే సురేష్, మునిష్కంత్, శరత్ అప్పానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పాన్ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత శిబు తమీన్స్ కుమార్తే రియా షిబు.. హెచ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై జియోస్టుడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. బృందా గోపాల్ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత కథనం

టాపిక్