అమ్మ అంటే ప్రాణం. అమ్మ అంటే నమ్మకం. అమ్మ అంటే ధైర్యం. అమ్మ అంటేనే జీవితం. అలాంటి తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. మాతృమూర్తి గురించి పొగడటానికి మాటలు సరిపోవు. తల్లిని కీర్తిస్తూ టాలీవుడ్ సినిమాల్లో ఎన్నో పాటలు వచ్చాయి. వాటిలో కొన్ని ఎంతో స్పెషల్ గా నిలిచిపోయాయి. ‘ఒకే ఒక జీవితం’ సినిమాలోని ‘అమ్మ’ సాంగ్ కూడా అలాంటిదే. ఆదివారం (మే 11) మదర్స్ డే సందర్భంగా ఓ సారి అమ్మ కోసం మీరూ పాడేయండి.
చనిపోయిన తల్లిన మళ్లీ బతికించుకోవడం కోసం టైమ్ ట్రావెల్ చేసే ఓ కొడుకు కథే ‘ఒకే ఒక జీవితం’ సినిమా. ఇందులో హీరో శర్వానంద్ కాగా.. అమ్మగా అక్కినేని అమల యాక్ట్ చేశారు. హీరో టైమ్ ట్రావెల్ చేశాక వచ్చే ఈ అమ్మ సాంగ్ మనసుకు హత్తుకుపోతోంది. ‘నీ పాదాలకు మువ్వల్లే’ అంటూ ఈ సాంగ్ లిరిక్స్ హృదయాలను తాకుతోంది.
దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన మరో ఆణిముత్యం ఈ పాట. ఇక సిధ్ శ్రీరామ్ మ్యాజికల్ వాయిస్ తో మరింత మధురంగా మారింది. ‘ఒకే ఒక జీవితం’ సినిమాకు జేక్స్ బెజోయ్ మ్యూజిక్ డైరెక్టర్. 2022లో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా ఆడియన్స్ ను అలరించింది.
అమ్మా.. వినమ్మా
నేనానాటి నీ లాలి పదాన్నే
ఓ అవునమ్మా నేనేనమ్మా
నువ్వు ఏనాడో కనిపెంచిన స్వరాన్నే
మౌనమై ఇన్నాళ్లు నిదురలో నే ఉన్నా
గానమై ఈనాడే మేలుకున్నా..
నీ పాదాలకు మువ్వల్లా
నా అడుగులు సాగాలమ్మ
నీ పెదవుల చిరునవ్వుల్లా
నా ఊపిరి వెలగాలమ్మా
నిరంతరం నీ చంటిపాపల్లే
ఉండాలి నే ఎన్నాళ్ళకీ
నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే అమ్మా
అణువణువణువు నీ కొలువే అమ్మా..
ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా..
నే కొలిచే శారదవే నను నిత్యం నడిపే సారథివే
బెదురు పోవాలంటే నువ్వు కనిపించాలి
నిదర రావాలంటే కథలు వినిపించాలి
ఆకలయ్యిందంటే నువ్వే తినిపించాలి
ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా
నువ్వుంటేనే నేను నువ్వంటే నేను
అనుకోలేకపోతే ఏమైపోతానో
నీ కడచూపే నన్ను కాస్తూ ఉండక
తడబడి పడిపోనా చెప్పమ్మా
మరిమరి నను నువు మురిపంగా
చూస్తూ ఉంటె చాలమ్మ
పరిపరి విధముల గెలుపులుగా
పైకి ఎదుగుతూ ఉంటానమ్మా
అయినా సరే ఏనాటికి
ఉంటాను నీ పాపాయినై
నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే
నిరంతరం నీ చంటిపాపల్లే
ఉండాలి నే నెన్నాళ్ళకీ
నిరంతరం నీ చంటిపాపల్లే
ఉండాలి నే నెన్నాళ్ళకీ
నిరంతరం నీ చంటిపాపల్లే
ఉండాలి నే నెన్నాళ్ళకీ
నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే అమ్మా
అణువణువణువు నీ కొలువే అమ్మా
ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా
నే కొలిచే శారదవే నను నిత్యం నడిపే సారథివే
అమ్మా
సంబంధిత కథనం