కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన తల మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. తల మూవీలో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించాడు. ఈ తెలుగు మూవీలో సీనియర్ హీరో రోహిత్‌తో పాటు ఇంద్రజ, ఎస్తేర్ నోరాన్హా కీలక పాత్రల్లో కనిపించారు.
మదర్ సెంటిమెంట్‌కు యాక్షన్ అంశాలు జోడించి అమ్మ రాజశేఖర్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. మూడు నెలల్లోనే ఈ మూవీ యూట్యూబ్‌లోకి వచ్చింది. వయలెన్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది.
రాంబాబుకు (రాగిన్ రాజ్) అమ్మ తప్ప ప్రపంచంలో నా అనే వాళ్లు ఎవరు ఉండరు. తల్లి కోసం ఎంత దూరం వెళ్లడానికైనా, ఎవరినైనా ఎదురించడానికైనా సిద్ధపడతాడు. రాంబాబు తండ్రి (రోహిత్)... లక్ష్మి అనే మరో మహిళ్లను పెళ్లిచేసుకుంటాడు. తల్లి కోరిక మేరకు తండ్రిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు రాంబాబు. తానేవరో చెప్పకుండా తండ్రికి దగ్గరవుతాడు.
ఓ రౌడీ కారణంగా తన తండ్రి పెద్ద సమస్యలతో చిక్కుకున్నాడనే నిజం బయటపడుతుంది? అదేమిటి? రాంబాబు తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? తండ్రిని తీసుకొస్తానని తల్లికి ఇచ్చిన మాటను రాంబాబు ఎలా నిలబెట్టుకున్నాడు? ఈశ్వరి (ఇంద్రజ), బబ్లూ (సత్యం రాజేష్)...రాంబాబు జీవితంలోకి ఎలా వచ్చారు? రాంబాబు ప్రేమించిన అమ్మాయి ఎవరు? అన్నదే తల మూవీ కథ.
తల మూవీలో రెండు పాటలకు తమన్ మ్యూజిక్ అందించడం గమనార్హం. దర్హతేజతో పాటు ఆస్లామ్ కేయ్ కూడా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేశారు.
కొరియోగ్రాఫర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మ రాజశేఖర్ రణం మూవీతో డైరెక్టర్‌గా మారారు. గోపీచంద్ హీరోగా నటించిన ఈ మూవీ పెద్ద హిట్టయ్యింది. ఆ తర్వాత రవితేజ ఖతర్నాక్, నితిన్ టక్కరితో పాటు డైరెక్టర్‌గా పలు సినిమాలు చేశాడు అమ్మ రాజశేఖర్. అవేవి అతడికి విజయాలను తెచ్చిపెట్టలేకపోయాయి.