పాపం.. షోయబ్ అక్తర్! అభిషేక్ పేరుతో అమితాబ్ బచ్చన్ వేరే లెవల్ ట్రోల్.. దుష్మన్ ను ఓడించారంటూ టీమిండియా విక్టరీపై ట్వీట్-amitabh bachchan trolls team pakistan after india defeats dushman shoaib akhtar asia cup 2025 ind vs pak abhishek ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  పాపం.. షోయబ్ అక్తర్! అభిషేక్ పేరుతో అమితాబ్ బచ్చన్ వేరే లెవల్ ట్రోల్.. దుష్మన్ ను ఓడించారంటూ టీమిండియా విక్టరీపై ట్వీట్

పాపం.. షోయబ్ అక్తర్! అభిషేక్ పేరుతో అమితాబ్ బచ్చన్ వేరే లెవల్ ట్రోల్.. దుష్మన్ ను ఓడించారంటూ టీమిండియా విక్టరీపై ట్వీట్

ఆసియా కప్ ఫైనల్లో టీం ఇండియా "దుష్మన్ (శత్రువు)" పాకిస్థాన్‌ను ఎలా ఓడించిందో అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. పాక్ టీమ్ ను, ఆ టీమ్ మాజీ పేసర్ షోయబ్ అక్టర్ ను వేరే లెవల్ ట్రోల్ తో పరువు తీసేశాడు అమితాబ్.

అమితాబ్ బచ్చన్ ట్వీట్

పాపం.. షోయబ్ అక్తర్, పాకిస్థాన్ క్రికెట్ టీమ్. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వేరే లెవల్ ట్రోల్ తో అక్తర్, పాక్ టీమ్ పరువు తీసేశారు. ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించిన భారత్ మరోసారి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ పోరులో ఇండియా ఆట తీరు, పాక్ ను చిత్తు చేసిన విధానంపై సెలబ్రిటీలు రియాక్టవుతున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా ట్వీట్ చేశాడు.

నోరు జారిన అక్తర్

పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నోరు జారాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బదులు అభిషేక్ బచ్చన్ పేరు వాడాడు. ఈ వ్యాఖ్యలను ఎగతాళి చేస్తూ అమితాబ్ ట్వీట్ చేశారు. షోయబ్‌ను ఆటపట్టిస్తూ అమితాబ్ 'అభిషేక్ బచ్చన్' బాగా ఆడినందుకు ప్రశంసించారు. టీం ఇండియా "దుష్మన్ (శత్రువు)"ని ఎలా ఓడించిందో కూడా ఆయన ట్వీట్ చేశారు.

వైరల్ ట్వీట్

‘‘జీత్ గయే (గెలిచేశాం) !! 'అభిషేక్ బచ్చన్' బాగా ఆడావు. "ఉధర్ జబాన్ లడ్ఖడై, ఔర్ ఉధర్, బినా బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ కియే, లడ్ఖడ దియా దుష్మన్ కో!! బోల్తీ బంద్ (మేము గెలిచాము! బాగా ఆడిన 'అభిషేక్ బచ్చన్. వారి నాలుక జారింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా జారింది. మీరు ఇప్పుడు మాట్లాడలేని శత్రువును ఓడించారు!) జై హింద్, జై భారత్, జై మా దుర్గా!!!!" అని ట్వీట్ చేశారు అమితాబ్ బచ్చన్.

అభిషేక్ బచ్చన్

పాకిస్తాన్ క్రికెట్ గురించి మాట్లాడేటప్పుడు షోయబ్ అభిషేక్ బచ్చన్ పేరును ప్రస్తావించాడు. ఇంతకు ముందు, షోయబ్ భారత్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్ అవకాశాలను విశ్లేషిస్తున్నప్పుడు పేర్లను తారుమారు చేశాడు. "ఒక ఊహాజనిత పరిస్థితిలో అభిషేక్ బచ్చన్‌ను పాకిస్తాన్ ముందుగానే అవుట్ చేస్తే, మిడిల్ ఆర్డర్‌తో ఏమి జరుగుతుంది? వారి మిడిల్ ఆర్డర్ బాగా ఆడలేదు" అని అతను అన్నాడు.

అభిషేక్ రియాక్షన్

ఈ వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ అయిన తర్వాత, నటుడు అభిషేక్ బచ్చన్ దానిపై స్పందించారు. అతను ఎక్స్ లో వార్తల లింక్‌ను షేర్ చేస్తూ "సార్, అన్ని గౌరవాలతో... వారు దానిని కూడా నిర్వహించగలరని అనుకోకండి! నేను అంత బాగా క్రికెట్ ఆడలేను’’ అని కామెంట్ చేశాడు.

అభిషేక్ బచ్చన్ కామెంట్
అభిషేక్ బచ్చన్ కామెంట్

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్

ఆదివారం (సెప్టెంబర్ 28) అర్ధరాత్రి ముగిసిన ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ ను ఇండియా ఓడించింది. తిలక్ వర్మ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. టీమ్ ఇండియా వారి రెండవ టీ20 ఆసియా కప్ టైటిల్‌ గెలుచుకుంది. వన్డే ఎడిషన్‌లతో సహా మొత్తం తొమ్మిదవ టైటిల్‌ దక్కించుకుంది. దుబాయ్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఇండియా ఓడించింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం