Amitabh Bachchan in Project K: ఇండియన్ సినిమా గర్వించదగిన నటుల్లో ఒకడు అమితాబ్ బచ్చన్. ఈ లెజెండరీ నటుడు మంగళవారం (అక్టోబర్ 11) తన 80వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌లాంటి నటులు అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.,ఇక అతని బర్త్‌డేను పురస్కరించుకొని ప్రాజెక్ట్ కే మూవీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్ కూడా రావడం విశేషం. ఈ పోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోయింది. మూవీ మేకర్స్ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. నాగ్‌అశ్విన్ డైరెక్షన్‌లో ఈ మూవీ వస్తున్న విషయం తెలిసిందే.,అమితాబ్ బర్త్‌డే సందర్భంగా వచ్చిన ఈ పోస్టర్‌లో బిగ్ బీ పిడికిలి మాత్రమే కనిపిస్తోంది. "5 దశాబ్దాలుగా వినోదం పంచిన పవర్ హౌజ్. ఈసారి నువ్వు చూపించబోయే కొత్త అవతారాన్ని ప్రపంచానికి చూపించాలని ఆతృతగా ఉంది. 80వ పుట్టినరోజు, మరెన్నో రాబోతున్న పుట్టినరోజులకు.. ఆ శక్తి ఎప్పుడూ మీతోనే ఉండాలని కోరుకుంటున్నాం, మా వెంట ఉన్న శక్తి మీరే అమితాబ్ బచ్చన్ సర్" అంటూ ట్వీట్ చేసింది.,ఈ పోస్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ప్రాజెక్ట్ కే అనేది వర్కింగ్ టైటిల్. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత మిగిలిపోయిన ప్రపంచంలో జరిగే స్టోరీగా ప్రాజెక్ట్ కే వస్తోందని భావిస్తున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ వచ్చిన ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు.,బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్రభాస్ చేస్తున్న మరో భారీ సినిమా ఇది. బాహుబలి తర్వాత అతని ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్లోనే వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సాహో, రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ ప్రాజెక్ట్ కేతోపాటు ఆదిపురుష్, సలార్‌లాంటి సినిమాలు మేకింగ్‌లో ఉన్నాయి.,