Amitabh Bachchan Kamal Haasan Movie As Brothers: హైలీ యాంటిసిపేటెడ్ మాగ్నమ్ ఓపస్ కల్కి 2898 ఏడీ యూనిక్ స్టొరీ లైన్, థీమ్, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్‌తో ఇండియన్ సినిమాలో చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. ఇవాళ అంటే జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా థియేటర్లలోకి కల్కి వచ్చేసింది.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది. విజువల్స్, యాక్షన్ సీన్స్, అతి భారీ కాస్ట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని రివ్యూవర్స్ చెబుతున్నారు. మంచి ఎక్స్‌పీరియిన్స్ ఇచ్చే మైథలాజీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా కల్కి సినిమాను ప్రశంసిస్తున్నారు ప్రేక్షకులు.
ఇదిలా ఉంటే, కల్కి 2898 ఏడీ గురించి ఎగ్జయిటింగ్ అయ్యే విశేషాల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించడం ఒకటి. ఇండియన్ సినిమాకు చెందిన ఇద్దరు లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో రీయూనియన్ కావడం విశేషంగా మారింది.
బిగి బి అమితాబ్, ఉలగ నాయగన్ కమలర్ ఇద్దరూ కలిసి కల్కి కంటే ముందుగానే ఓ సినిమాలో నటించారు. ఆ సినిమానే గెరాఫ్తార్ (Geraftaar Movie). 1985 సంవత్సరంలో కల్ట్ క్లాసిక్‌గా ఈ సినిమా నిలిచిన గెరాఫ్తార్‌లో ఈ అగ్ర హీరోలు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇందులో వీరిద్దరు బ్రదర్స్ కరణ్, కిషన్ పాత్రలను పోషించారు.
1985 సెప్టెంబరు 13న విడుదలైన గెరాఫ్తార్ చిత్రం నేటికీ అందరికీ ఇష్టమైన క్లాసిక్‌గా నిలిచింది. అలాగే ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నటించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రయాగ్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా వచ్చి ఇప్పటికి 39 ఏళ్లు అవుతోంది. అంటే, 39 ఏళ్ల తర్వాత మరోసారి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఇదిలా ఉంటే, కల్కి 2898 ఏడీలో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రను పోషించారు. ఈ పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్‌లో కమల్ హసన్ లుక్, గెటప్ అందరినీ చాలా సర్‌ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హసన్ మేకోవర్ అన్‌బిలివబుల్ అండ్ స్టన్నింగ్‌గా ఉంది. మునుపెన్నడూ చూడని మైండ్ బ్లోయింగ్ అవతార్‌లో కనిపించారు కమల్ హాసన్.
అలాగే ఇందులో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపించారు. ఈ లెజెండరీ స్టార్స్‌ని ఒకే ఫ్రేమ్‌లో కలిపి ఈ చిత్రం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోంది. సినిమా విడుదల కంటే ముందు ఈ రెండు పాత్రల గ్లింప్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. చాలా ఆసక్తిని రేకెత్తించాయి. దాంతోనే సినిమాపై అంచనాలు పెరిగాయి.
విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమాను వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అగ్ర నిర్మాత సి. అశ్వని దత్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మాగ్నమ్ ఓపస్ లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీ రోల్స్ పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ గెస్ట్ రోల్స్ చేశారు.