బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి 2022లో వచ్చిన 'ఝుండ్' సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాన్షు అలియాస్ బాబు రవి సింగ్ ఛెత్రి కన్నుమూశాడు. 21 ఏళ్ల ప్రియాన్షు నాగ్‌పూర్ లోని జరిపట్కా ప్రాంతంలో బుధవారం (అక్టోబర్ 8) తెల్లవారుజామున జరిగిన తాగుబోతుల గొడవలో తన స్నేహితుడి చేతిలో దారుణంగా హత్యకు గురైనట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. నిందితుడు ధ్రువ్ లాల్ బహదూర్ సాహు (20)ను పోలీసులు అరెస్టు చేశారు.
అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో నటించిన ఝుండ్ మూవీ మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమాలో ప్రియాన్షు కీలక పాత్ర పోషించాడు. తాజా ఘటన గురించి పోలీస్ అధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం.. ప్రియాన్షు, ధ్రువ్ స్నేహితులు. ఇద్దరూ తరచుగా కలిసి మందు తాగేవాళ్లు.
"మంగళవారం (అక్టోబర్ 7) అర్ధరాత్రి తర్వాత ప్రియాన్షు, ఛెత్రి సాహు మోటార్‌సైకిల్‌పై జరిపట్కా ప్రాంతంలోని ఒక నిర్మానుష్యమైన ఇంటికి మందు తాగడానికి వెళ్లారు. ఛెత్రి బుధవారం తెల్లవారుజామున గాయపడి కనిపించడానికి కొద్ది గంటల ముందు ఇది జరిగింది" అని పోలీసులు తెలిపారు. ఆ రోజు రాత్రి జరిగిన వాగ్వాదంలో ప్రియాన్షు.. సాహును బెదిరించి ఆ తర్వాత నిద్రపోయాడు.
ప్రియాన్షును ధృవ్ సాహు ఎలా చంపాడో పోలీసులు వెల్లడించారు. "ప్రియాన్షు నుండి హాని జరుగుతుందనే భయంతో.. సాహు అతన్ని వైర్లతో కట్టి, పదునైన ఆయుధంతో దాడి చేశాడు" అని చెప్పారు.
పోలీసులు చెప్పినదాని ప్రకారం స్థానికులు ప్రియాన్షును గుర్తించారు. నిందితుడు సాహు.. ప్రియాన్షు ఒంటిపై బట్టలు తొలగించి ప్లాస్టిక్ వైర్లతో కట్టివేశాడు. వెంటనే అతన్ని మేయో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించినట్లు డాక్టర్లు చెప్పారు.
ప్రియాన్షు.. నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించిన 'ఝుండ్' సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ఇండియాలో స్లమ్ సాకర్‌కు మార్గదర్శకుడైన విజయ్ బార్సే కథను ఆధారంగా చేసుకుని రూపొందించారు. ఇందులో ఆ విజయ్ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించాడు.
సంబంధిత కథనం