Amitabh Bachchan: మెగాస్టార్ ఎప్పుడూ ఉత్తరం వైపు ముఖం చేసే భోజనం చేస్తాడట.. ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?-amitabh bachchan eats facing north always here is what happens when you face north while eating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amitabh Bachchan: మెగాస్టార్ ఎప్పుడూ ఉత్తరం వైపు ముఖం చేసే భోజనం చేస్తాడట.. ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Amitabh Bachchan: మెగాస్టార్ ఎప్పుడూ ఉత్తరం వైపు ముఖం చేసే భోజనం చేస్తాడట.. ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Hari Prasad S HT Telugu
Jan 07, 2025 03:53 PM IST

Amitabh Bachchan: ఉత్తరం వైపు ముఖం చేస్తూ భోజనం చేస్తే ఏం జరుగుతుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎందుకు ఎప్పుడూ ఆ వైపే కూర్చొని తింటాడు? ఈ ప్రశ్నలకు తాజాగా తన కౌన్ బనేగా క్రోర్‌పతి షోలో బిగ్ బీ సమాధానమిచ్చాడు.

మెగాస్టార్ ఎప్పుడూ ఉత్తరం వైపు ముఖం చేసే భోజనం చేస్తాడట.. ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
మెగాస్టార్ ఎప్పుడూ ఉత్తరం వైపు ముఖం చేసే భోజనం చేస్తాడట.. ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Amitabh Bachchan: వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని దిక్కుల వైపు కూర్చొని తినడం వల్ల మంచి జరుగుతుందని కొందరు నమ్ముతారు. అలాంటి వాళ్లలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు. ఎందుకంటే అతడు ఇంట్లో ఎప్పుడూ ఉత్తర దిక్కు వైపు ముఖం చేసి భోజనం చేస్తాడట. ఈ విషయాన్ని కౌన్ బనేగా క్రోర్‌పతి షోలో ఓ కంటెస్టెంట్ చెప్పగా.. అది నిజమే అని బిగ్ బీ అన్నాడు. అమితాబ్ ఇంట్లో భోజనం అలవాట్ల గురించి అతని తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ తన పుస్తకంలో రాయడాన్ని ఓ కంటెస్టెంట్ ప్రస్తావించారు.

yearly horoscope entry point

బిగ్ బీకి ఉత్తర దిక్కుకు ముఖం చేసే అలవాటు

కౌన్ బనేగా క్రోర్‌పతి 16వ సీజన్లో భాగంగా కుశలేంద్ర ప్రతాప్ అనే కంటెస్టెంట్ అమితాబ్ బచ్చన్, అతని తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కాలా పత్తర్ మూవీ షూటింగ్ సమయంలో బిగ్ బీ ఎలా కలుషిత నీటి బారిన పడినా ఎలా షూటింగ్ కొనసాగించిందీ.. అతని దీర్ఘాయుష్సు కోసం తండ్రి ఎలా తపన పడేదన్న విషయాలను గుర్తు చేశారు.

ఈ అంశాలను హరివంశ్ రాయ్ బచ్చన్ తన పుస్తకంలో రాసిన అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా అదే పుస్తకంలో అమితాబ్ ఎప్పుడూ ఇంట్లో ఉత్తరం దిక్కుకు ముఖం చేస్తూ భోజనం చేసే విషయాన్ని కూడా రాసినట్లు ఆ కంటెస్టెంట్ తెలిపారు.

"మీ కుటుంబం ఎప్పుడూ కలిసే భోజనం చేసే విషయాన్ని చెప్పారు. మీరెప్పుడూ ఉత్తరం దిక్కుకు ముఖం చేసి కూర్చొంటారట. అలా చేస్తే అనుకున్నవి నిజమవుతాయట. మీకు అలా దీర్ఘాయుష్సు రావాలని ఆయన కూడా కోరుకునేవారట. నాకు నిజం కావాలి.. నీకు ఆయుష్సు కావాలని ఆయన అనేవారట.

మీ స్థానంలో ఆయన కూర్చోవాలని అనుకుని మిమ్మల్ని అడిగితే.. నిజాన్ని వదులుకొని వచ్చే దీర్ఘాయుష్షు నాకు అవసరం లేదని మీరు అనేవారట" అని ఆ కంటెస్టెంట్ బిగ్ బీతో అన్నారు. దీనికి అమితాబ్ స్పందిస్తూ.. అది నిజమే అని చెప్పాడు. తనకెప్పుడూ దీర్ఘాయుష్షు ఉండాలని మాత్రమే తన తండ్రి కోరుకునేవారని, ఆయనకు కావాల్సింది అదొక్కటే అని బిగ్ బీ చెప్పాడు.

ఉత్తరం వైపు ముఖం చేసి తింటే..

వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం వైపు ముఖం చేసి భోజనం చేయడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఇలా తినడం వల్ల జ్ఞానం సంపాదించడంతోపాటు సంపద, ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఈ దిశగా ముఖం చేసి భోజనం చేయడం అనేది విద్యార్థులకు, కెరీర్లో పురోగతి కోసం ఎదురు చూస్తున్న వారికి మరింత మంచిది అని కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది.

Whats_app_banner