Amitabh Bachchan Birthday: టీవీ షోలో కంటతడి పెట్టిన మెగాస్టార్.. బర్త్ డే సెలబ్రేషన్స్‌తో ఎమోషనల్
Amitabh Bachchan Birthday: లైవ్ షోలో కంటతడి పెట్టాడు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. తన బర్త్ డే సెలబ్రేషన్స్‌తో అతడు ఎమోషనల్ అయ్యాడు. కేబీసీ 15వ సీజన్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఎపిసోడ్ బుధవారం (అక్టోబర్ 11) టెలికాస్ట్ కానుంది.
Amitabh Bachchan Birthday: బాలీవుడ్ లెజెండరీ యాక్టర్, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కంటతడి పెట్టాడు. తన 81వ పుట్టిన రోజు వేడుకలు జరిగిన కేబీసీ సెట్లోనే బిగ్ బీ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమోను సోనీ సోమవారం (అక్టోబర్ 9) రిలీజ్ చేసింది. ఇక ఆ ఎపిసోడ్ అమితాబ్ పుట్టిన రోజు అయిన బుధవారం (అక్టోబర్ 11) టెలికాస్ట్ కానుంది.
అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా క్రోర్‌పతి 15వ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఐదు దశాబ్దాలుగాపైగా బాలీవుడ్ ను ఏలుతున్న బిగ్ బీ మరో రెండు రోజుల్లో తన 81వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు. అయితే కేబీసీ షో మేకర్స్ మాత్రం ముందుగానే అతడి బర్త్ డేను సెలబ్రేట్ చేసి అక్టోబర్ 11న టెలికాస్ట్ చేయబోతున్నారు.
ఈ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేయగా.. అందులో నన్ను ఇంకెంతలా కంటతడి పెట్టిస్తారు అంటూ అమితాబ్ భావోద్వేగానికి గురవడం చూడొచ్చు. ఈ ఎపిసోడ్ మొత్తం బిగ్ బీని సర్‌ప్రైజ్ చేశారు షో ఆర్గనైజర్లు, అభిమానులు. "ఇన్నాళ్లూ నేను అవతలి వాళ్లకు టిష్యూలు ఇచ్చేవాడిని.. ఇప్పుడు నాకే అవసరం అవుతున్నాయి"అని అమితాబ్ ఈ ప్రోమోలో అన్నాడు.
ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకుంటూ కళ్లు తుడుచుకోవడం వీడియోలో చూడొచ్చు. బిగ్ బీ బర్త్ డే కోసం కేబీసీ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు ETimes తన రిపోర్టులో వెల్లడించింది. ఇందులో భాగంగా పద్మ విభూషణ్ సరోద్ ప్లేయర్ ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్ షో కూడా ఏర్పాటు చేశారు. ఇక చిరంజీవితోపాటు పలువురు ఇతర ఇండస్ట్రీల సినీ ప్రముఖులు అమితాబ్ కు బర్త్ డే విషెస్ చెప్పనున్నారు.
రెండు దశాబ్దాలుగా సోనీ టీవీలో విజయవంతంగా నడుస్తున్న క్విజ్ షో కౌన్ బనేగా క్రోర్‌పతి. ఒక్క సీజన్ తప్ప మిగతా అన్ని సీజన్లలోనూ అమితాబ్ బచ్చన్ ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ క్విజ్ షో 15వ సీజన్ నడుస్తోంది. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ టీవీ, సోనీలివ్ యాప్ లో ఈ షో చూడొచ్చు.