OTT: ఓటీటీలోకి ఒక్క రోజు ముందే వచ్చేసిన సరికొత్త తెలుగు మూవీ.. కానీ, చిన్న ట్విస్ట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-ambajipeta marriage band ott streaming on aha gold suhas ambajipeta marriage band ott release date february 29 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ambajipeta Marriage Band Ott Streaming On Aha Gold Suhas Ambajipeta Marriage Band Ott Release Date February 29

OTT: ఓటీటీలోకి ఒక్క రోజు ముందే వచ్చేసిన సరికొత్త తెలుగు మూవీ.. కానీ, చిన్న ట్విస్ట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Feb 29, 2024 08:48 AM IST

Ambajipeta Marriage Band OTT Streaming: కలర్ ఫొటో మూవీతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ నటించిన రీసెంట్ సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఫిబ్రవరి 2న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

ఓటీటీలోకి ఒక్క రోజు ముందే వచ్చేసిన సరికొత్త తెలుగు మూవీ.. కానీ, చిన్న ట్విస్ట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి ఒక్క రోజు ముందే వచ్చేసిన సరికొత్త తెలుగు మూవీ.. కానీ, చిన్న ట్విస్ట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Ambajipeta Marriage Band OTT Date: సుహాస్ హీరోగా నటించిన సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు డైరెక్టర్ దుశ్యంత్ కటికినేని.

అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా ఈ నెల 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజీకు ముందు మూవీ బిగ్ టికెట్‌ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసి సినిమా చాలా బాగుందంటూ ప్రశంసించారు. ఇదొక స్పెషల్ ఫిల్మ్ అని, తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. అయితే విడుదలైన తర్వాత అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో సుహాస్ నటనపై ప్రశంసలు కురిశాయి.

అయితే ఇతర సినిమాలతో పోటీ కారణంగా అంబాజీపేట మ్యారేజి బ్యాండుకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. దాంతో వెంటనే థియేటర్‌లో నుంచి సినిమాను తీసేయడం జరిగినట్లు సమాచారం. అయితే, మంచి బజ్ క్రియేట్ చేసిన అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మొదట్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. అనంతరం మూడు రోజుల్లోనే రూ. 8 కోట్లకుపైగా కలెక్షన్స్ వసూలి చేసింది. రూ. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్‌లోనే పూర్తి చేసి లాభాల్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం.

ప్రస్తుతం అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై టాక్ నడుస్దోంది. గత కొద్ది రోజులుగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఓటీటీ స్ట్రీమింగ్‌పై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ఈ మూవీ రిలీజ్ కానుందని అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చేసింది. ఇటీవలే స్ట్రీమింగ్ డేట్‌ను కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అంబాజీపేట మ్యారేజి బ్యాండును ఓటీటీలో మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు.

అయితే, అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీని ఫిబ్రవరి 29 నుంచే స్ట్రీమింగ్ చేస్తోంది ఆహా. కానీ, ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు మాత్రమే సినిమాను చూడగలరు. ఇది కూడా రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలిపారు. కానీ ఫిబ్రవరి 28న రాత్రి 11 గంటల సమయంలో "కొంచెం లేటు.. కానీ సౌండ్ మాత్రం మోగిపోద్ది" అంటూ ఓ అప్డేట్ ఇచ్చింది ఆహా టీమ్. అనంతరం ఫిబ్రవరి 29న ఉదయం 7 గంటల సమయంలో ఓటీటీలో అంబాజీపేట మ్యారేజి బ్యాండు రిలీజైంది.

కాస్త ఆలస్యంగా అని చెప్పిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు స్ట్రీమింగ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది ఆహా. అయితే, ఇది ఒక ఆహా గోల్డ్ ఉన్న వారికి మాత్రమే వర్తించడంతో మిగతా సాధారణ సబ్‌స్క్రైబర్స్ మాత్రం ఇంకా ఒక్క రోజు ఆగాల్సిందే. ఆహా గోల్డ్ వారికి మాత్రం ఒక్క రోజు ముందే అంబాజీపేట మ్యారేజి బ్యాండును ఓటీటీలో చూసే అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమాలో సుహాస్‌తోపాటు శరణ్య ప్రదీప్ కీలక పాత్ర పోషించింది. శివానీ నాగరం హీరోయిన్‌గా నటించింది.

WhatsApp channel