Amazon Prime: 2025లో అమెజాన్ ప్రైమ్ కొత్త రూల్ - ప్రొడ్యూసర్లకు షాక్ - రెవెన్యూలో భారీగా కోత!
Amazon Prime: అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రొడ్యూసర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. షేరింగ్ బేసిస్ మీద రిలీజ్ చేసే సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు చెల్లించే రెవెన్యూలో భారీగా కోత పెట్టింది. గంటకు నాలుగు రూపాయల నుంచి రెండు రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.
Amazon Prime: 2025లో కొత్త రూల్స్‌తో అటు యూజర్లకు, ఇటు ప్రొడ్యూసర్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో పెద్ద షాక్ ఇవ్వబోతున్నది. జనవరి నుంచి చేయబోతున్న మార్పులను ఒక్కొక్కటిగా అనౌన్స్‌చేస్తోంది. ప్రస్తుతం థియేటర్ల తర్వాత ఓటీటీనే నిర్మాతలకు ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది.
డిజిటల్ రైట్స్ కోసం కోట్లలో నిర్మాతలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ చెల్లిస్తోన్నాయి. ఔట్ రైట్ రేటుతో పాటు రెంటల్, రెవెన్యూ షేరింగ్ బేసిస్‌లోనే సినిమాలను ఓటీటీ ప్లాట్‌పామ్స్ కొనుగోలు చేస్తోన్నాయి.
రెవెన్యూ షేరింగ్ బేసిస్...
ఓటీటీలో ప్లాట్‌ఫామ్స్‌లో చిన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఎక్కువగా రెవెన్యూ షేరింగ్ బేసిస్‌లోనే రిలీజ్ అవుతోన్నాయి. ఓటీటీలో సబ్‌స్క్రైబర్లు సినిమాను ఎన్ని గంటలు చూశారనే లెక్కల ప్రకారం వచ్చే రెవెన్యూలో నుంచి నిర్మాతలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ డబ్బులు చెల్లిస్తుంటాయి.
ఈ రెవెన్యూ షేరింగ్‌లో అమెజాన్ ప్రైమ్ భారీగా కోత పెట్టింది. ఇదివరకు గంటకు నాలుగు రూపాయలను నిర్మాతలకు, కంటెంట్ ప్రొవైడర్లకు, నిర్మాతలకు అమెజాన్ ప్రైమ్ చెల్లిస్తూ వచ్చింది. నాలుగు రూపాయలను రెండు రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మార్పు జనవరి 15 నుంచి అమలులోకి రాబోతున్నట్లు ప్రకటించింది.
లక్ష దాటితే...
అంతే కాకుండా ఓ మూవీ, వెబ్‌సిరీస్‌తో పాటు ఇతర కంటెంట్‌ను లక్ష గంటల కంటే ఎక్కువగా చూస్తే...ఒక్క రూపాయి మాత్రమే కంటెంట్ ప్రొవైడర్లకు చెల్లిస్తామని వెల్లడించింది. అమెజాన్ నిర్ణయంతో చిన్న సినిమా ప్రొడ్యూర్ల, వెబ్‌సిరీస్ మేకర్స్ ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని మూవీ వర్గాలు చెబుతోన్నాయి.
యూజర్లకు లిమిట్...
కంటెంట్ ప్రొవైడర్లకు మాత్రమే కాకుండా యూజర్లకు కూడా అమెజాన్ కొత్త ఏడాదిలో షాక్ ఇవ్వబోతున్నది. స్ట్రీమింగ్ డివైసెస్ లిమిట్‌ను తగ్గించింది. 2025 జనవరి 15 నుంచి ఒక్కో అమెజాన్ ప్రైమ్ అకౌంట్‌కు ఐదు స్ట్రీమింగ్ డివైసెస్ మాత్రమే యాక్సెస్ అయ్యేలా రూల్ పెట్టింది.
ఇందులో రెండు మాత్రమే టీవీ డివైస్‌లు ఉండాలని కండీషన్ పెట్టింది. అంతే కాకుండా ఒకేసారి ఇద్దరు యూజర్లు ఒకే సినిమాను చూడటానికి వీలు లేకుండా కూడా కొత్త రూల్ విధించింది. ఈ అమెజాన్ ప్రైమ్ రూల్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. అమెజాన్ ప్రైమ్ బాటలోనే యూజర్ల లిమిట్ విషయంలో డిస్నీ హాట్ స్టార్ కూడా అడుగులు వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.