అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈనెల వచ్చిన 7 టాప్ చిత్రాలు.. హారర్, కామెడీ, యాక్షన్-amazon prime video ott top 7 movie releases in april chhorii 2 veera dheera soooran crazxy and more streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈనెల వచ్చిన 7 టాప్ చిత్రాలు.. హారర్, కామెడీ, యాక్షన్

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈనెల వచ్చిన 7 టాప్ చిత్రాలు.. హారర్, కామెడీ, యాక్షన్

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈనెల చాలా చిత్రాలు అడుగుపెట్టాయి. అందులో ఏడు సినిమాలు ఇంట్రెస్టింగ్‍గా అనిపించాయి. ఆ చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి. చూడకపోతే ప్లాన్ చేసుకోండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈనెల వచ్చిన 7 టాప్ చిత్రాలు.. హారర్, కామెడీ, యాక్షన్

పాపులర్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈనెల (ఏప్రిల్, 2025) అనేక సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. డిఫరెంట్ జానర్ల చిత్రాలు ఎంట్రీ ఇచ్చాయి. వాటిలో ఏడు సినిమాలు ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాయి. ఈ చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. ప్రైమ్ వీడియో ఓటీటీటో ఈనెల వచ్చిన 7 టాప్ చిత్రాలు ఏవంటే..

ఛోరీ 2

ఛోరీ 2 సినిమా ఈనెలలోనే ఏప్రిల్ 11వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. నుష్రత్ బరూచా, సోహా అలీ ఖాన్ ఈ హారర్ థ్రిల్లర్ చిత్రంలో లీడ్ రోల్స్ చేయగా.. విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు. కూతురిని రక్షించుకునేందుకు తల్లి చేసే ప్రయత్నాల చుట్టూ ఈ సీక్వెల్ చిత్రం సాగుతుంది. హారర్ ఎలిమెంట్లు, థ్రిల్లింగ్ సీన్లతో ఛోరీ 2 ఉంది.

జాబిలమ్మ నీకు అంత కోపమా

తమిళ చిత్రం ‘నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబమ్’ (నీక్)కు తెలుగు వెర్షన్ అయిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ ఏప్రిల్ 1వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళ వెర్షన్ కంటే పది రోజులు ఆలస్యంగా తెలుగు డబ్బింగ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించారు. పవీశ్ నారాయణన్, అనిఖ సురేంద్రన్ లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీ థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

వీర ధీర శూరన్

చియాన్ విక్రమ్ హీరోగా నటించిన వీర ధీర శూరన్ పార్ట్ 2 చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఏప్రిల్ 24న స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో స్ట్రీమ్ అవుతోంది. ఎస్‍యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 27న థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ వీర ధీర శూరన్ చిత్రాన్ని ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూసేయవచ్చు.

క్రేజీ

క్రేజీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఏప్రిల్ 25న రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో ఆన్‍స్క్రీన్‍లో సోహమ్ షా ఒక్కరే కనిపిస్తారు. మిగిలిన పాత్ర వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. ఈ సినిమాకు గిరీశ్ కోహ్లీ దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ మూవీ మోస్తరు హిట్ సాధించింది.

ముర్ముర్

తమిళ హారర్ థ్రిల్లర్ చిత్రం ముర్ముర్.. ఏప్రిల్ 4న స్ట్రీమింగ్‍కు వచ్చింది. రిచీ కపూర్, దేవరాజ్ అరుముగమ్, యువికా రాజేంద్రన్ లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీకి హేమంత్ నారాయణన్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ మూవీకి మిక్స్డ్ టాక్ దక్కింది.

సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్

బాలీవుడ్ చిత్రం ‘సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్’ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. ఏప్రిల్ 25న పూర్తిస్థాయి స్ట్రీమింగ్‍కు వచ్చింది. రెంట్ తొలగిపోయి రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. రీమా కగ్తి దర్శకత్వంలో ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి బాగా ప్రశంసలు దక్కాయి.

బ్యాడ్ బాయ్స్

మలయాళ మూవీ బ్యాడ్ బాయ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఏప్రిల్ 11న ఎంట్రీ ఇచ్చింది. ఈ యాక్షన్ కామెడీ చిత్రంలో రహమాన్, బాబు ఆంథోనీ లీడ్ రోల్స్ చేయగా.. ఒమర్ లులు దర్శకత్వం వహించారు. థియేటర్లలో రిలీజైన సుమారు ఆరు నెలల తర్వాత్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది బ్యాడ్ బ్యాయ్స్ మూవీ.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం