హిట్ 3 వచ్చేస్తోంది.. మరి హిట్, హిట్ 2 మూవీస్ చూశారా? ఈ రెండు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఒకే ఓటీటీలో..-amazon prime video ott streaming hit hit 2 movies hit 3 to release on 1st may ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  హిట్ 3 వచ్చేస్తోంది.. మరి హిట్, హిట్ 2 మూవీస్ చూశారా? ఈ రెండు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఒకే ఓటీటీలో..

హిట్ 3 వచ్చేస్తోంది.. మరి హిట్, హిట్ 2 మూవీస్ చూశారా? ఈ రెండు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఒకే ఓటీటీలో..

Hari Prasad S HT Telugu

నాని నటించిన హిట్ 3 మూవీ థియేటర్లలో రిలీజ్ కు సిద్ధమైంది. మరి ఈ ఫ్రాంఛైజీ నుంచి గతంలో వచ్చిన హిట్, హిట్ 2 మూవీస్ మీరు చూశారా? ఈ రెండు సినిమాలూ ఒకే ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. మరి ఈ మూవీస్ స్టోరీ ఏంటి? అవి హిట్ అయ్యాయా లేదా? ఎక్కడ చూడాలన్న వివరాలు తెలుసుకోండి.

హిట్ 3 వచ్చేస్తోంది.. మరి హిట్, హిట్ 2 మూవీస్ చూశారా? ఈ రెండు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఒకే ఓటీటీలో..

హిట్ ఫ్రాంఛైజీ.. పేరుకు తగినట్లే మంచి హిట్ అయింది. హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ అంటూ ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. తొలి మూవీలో విశ్వక్సేన్, రెండో సినిమాలో అడవి శేష్ నటించగా.. ఇప్పుడు మూడో సినిమాలో నాని లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఒక్కో భాగంలో ఒక్కో కేసు, దానిని ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదిస్తాడన్న కథలతో డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు.

హిట్ ద ఫస్ట్ కేస్ మూవీ

హిట్ ఫ్రాంఛైజీలో వచ్చిన తొలి సినిమా హిట్: ద ఫస్ట్ కేస్. 2020లో ఈ మూవీ రిలీజైంది. ఇందులో విక్రమ్ రుద్రరాజు అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో విశ్వక్సేన్ నటించాడు. తెలంగాణ సీఐడీలోని హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్)లో సభ్యుడిగా కనిపించాడు. రుహానీ శర్మ ఫిమేల్ లీడ్ గా కనిపించింది. తన గతంలో జరిగిన ఓ ఘటనతోనే సతమతమవుతున్న ఆ పోలీస్ అధికారి.. హైదరాబాద్ లోని ఔటర్ రింగు రోడ్డుపై కనిపించకుండా పోయిన ప్రీతి అనే అమ్మాయి కేసును ఎలా ఛేదిస్తాడన్నదే ఈ హిట్: ద ఫస్ట్ కేస్ మూవీ స్టోరీ.

రూ.6.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.11 కోట్లు వసూలు చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ను శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన తీరు తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. థియేటర్లలో ఓ మోస్తరు సక్సెస్ సాధించినా.. తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా మరింత ఆదరణ దక్కించుకుంది. ఇందులో విశ్వక్సేన్ నటనకు ప్రశంసలు లభించాయి.

హిట్: ది సెకండ్ కేస్ మూవీ

ఇక హిట్ యూనివర్స్ నుంచి 2022లో వచ్చిన మరో మూవీ హిట్: ది సెకండ్ కేస్. ఇందులో అడవి శేష్, మీనాక్షి చౌదరి, సుహాస్ నటించారు. రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.42.5 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్)లో పని చేసే పోలీస్ ఆఫీసర్ కృష్ణదేవ్ గా అడవి శేష్ నటించాడు.

ఓ దారుణమైన హత్య కేసును ఛేదించే బాధ్యత అతనిపై పడుతుంది. ఈ కేసును అతడు ఎలా పరిష్కరించాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? అసలు ఆ హత్య చేసింది ఎవరు? అన్నది తెలియాలంటే ఈ హిట్ 2 చూడాల్సిందే. హిట్ మూవీలాగే హిట్ 2లోనూ ఊహించని ట్విస్టులు థ్రిల్ పంచుతాయి. ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే అందుబాటులో ఉంది.

హిట్ 3 మూవీ గురించి..

ఇక ఇప్పుడు హిట్ ఫ్రాంఛైజీ నుంచి హిట్ 3 రాబోతోంది. ఇందులో నాని లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపించనున్నాడు. సీరియల్ కిల్లింగ్ కు పాల్పడిన ముఠాను పట్టుకోవడానికి జమ్ముకశ్మీర్ లో అర్జున్ సర్కార్ చేసే సాహసాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ మూవీ ఏకంగా రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇందులో నాని సరసన శ్రీనిధి శెట్టి నటించింది.

ఈ గురువారం (మే 1) థియేటర్లలో సినిమా రిలీజ్ కాబోతోంది. గతంలో వచ్చిన రెండు సినిమాలు అంచనాలకు మించి సక్సెస్ కావడంతో ఈ మూడో సినిమాపై అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. అందులోనూ నాని నటిస్తుండటంతో అతని కెరీర్లో మరో రూ.100 కోట్ల హిట్ పడబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం