ప్రైమ్ వీడియోలో 66 అవార్డులు గెలుచుకున్న ఈ సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ చూశారా.. ఐఎండీబీలో 9 రేటింగ్-amazon prime video comedy web series panchayat won 66 awards imdb rating 9 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ప్రైమ్ వీడియోలో 66 అవార్డులు గెలుచుకున్న ఈ సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ చూశారా.. ఐఎండీబీలో 9 రేటింగ్

ప్రైమ్ వీడియోలో 66 అవార్డులు గెలుచుకున్న ఈ సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ చూశారా.. ఐఎండీబీలో 9 రేటింగ్

Hari Prasad S HT Telugu

అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన ఓ వెబ్ సిరీస్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ సిరీస్ కు ఏకంగా 66 అవార్డులు రావడం విశేషం. అంతేకాదు ఐఎండీబీలో 9 రేటింగ్ కూడా నమోదైంది.

ప్రైమ్ వీడియోలో 66 అవార్డులు గెలుచుకున్న ఈ సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ చూశారా.. ఐఎండీబీలో 9 రేటింగ్ (IMDb)

ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాలకు దీటుగా వెబ్ సిరీస్ కూడా దుమ్మురేపుతున్నాయి. అలాంటి ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా. 2020లో వచ్చిన ఒక హిందీ కామెడీ వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్ ఏకంగా 66 అవార్డులు గెలుచుకుంది. ఇప్పటికి ఈ సిరీస్‌కు నాలుగు సీజన్లు వచ్చాయి. మరి ఆ సిరీస్ ఏంటో చూసేయండి.

పంచాయత్ వెబ్ సిరీస్

మనం మాట్లాడుకుంటున్న ఈ సిరీస్ హిందీ వెబ్ సిరీస్‌ల జాబితాలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. నాలుగు సీజన్లలో కలిపి ఇందులో మొత్తం 32 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఆ వెబ్ సిరీస్ పేరు పంచాయత్. 2020లో తొలి సీజన్ ప్రేక్షకుల ముందుకు రాగా.. తర్వాత మరో మూడు సీజన్లతో అలరించింది. ఈ వెబ్ సిరీస్ కు ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్ నమోదు కావడం విశేషం.

ఈ సిరీస్ మొదటి సీజన్ 2020లో వచ్చింది. రెండవ సీజన్ 2022లో, మూడవ సీజన్ 2024లో, నాలుగో సీజన్ జూన్ 2025లో స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా, ఫైసల్ మాలిక్, చందన్ రాయ్, సన్వికా, దుర్గేష్ కుమార్, పంకజ్ ఝా, ఆసిఫ్ ఖాన్ వంటి అద్భుతమైన నటీనటులు నటించారు.

పంచాయత్‌కు 66 అవార్డులు

పంచాయత్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడమే కాదు.. అవార్డుల పంట కూడా పండించింది. ఫులేరా అనే ఊరు, అక్కడి ప్రజలు, ఊరి పెద్ద, ఆ ఊరికి ఉద్యోగం చేయడానికి వచ్చి కష్టాలు పడే ఓ పంచాయత్ సెక్రటరీ చుట్టూ తిరిగే కథే ఈ పంచాయత్ వెబ్ సిరీస్.

ఐఎండీబీ ప్రకారం ఈ సిరీస్ మొత్తం 4 IIFA అవార్డులు, 11 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు, 9 ఫిల్మ్‌ఫేర్‌ సహా మొత్తం 66 అవార్డులను గెలుచుకుంది. ఈ సిరీస్‌ను చందన్ కుమార్, దీపక్ కుమార్ మిశ్రా క్రియేట్ చేశారు. పంచాయత్ ఐదో సీజన్ కూడా సిద్ధమవుతోంది. ఈ మధ్యే ఈ కొత్త సీజన్ గురించి అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే ఈ కామెడీ వెబ్ సిరీస్ కు ఇదే చివరి సీజన్ కాబోతుండటం అభిమానులను కాస్త అసంతృప్తికి గురి చేస్తోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం