Aishwarya Rajesh: సుడల్ వెబ్‌సిరీస్ సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సుడల్ సీజన్ 2 రిలీజ్ అవుతున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది.
ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌తో పాటు కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది. ఈ పోస్టర్‌లో ఐశ్వర్య రాజేష్‌తో పాటు కాథిర్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తోన్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ జాతర విజువల్స్, విచిత్ర అలంకరణలో ఉన్న ఓ ముఖం కనిపించడం ఆసక్తిని పంచుతోంది.
సుడన్ సీజన్‌లో 2లో ఐశ్వర్య రాజేష్, కాథిర్‌తో పాటు గౌరి జి కిషన్, మంజిమా మోహన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ వెబ్‌సిరీస్‌కు పుష్కర్- గాయత్రి క్రియేటర్స్‌గా వ్యవహరిస్తోండగా....సర్జున్, బ్రహ్మ దర్శకత్వం వహిస్తోన్నారు. జాతర నేపథ్యానికి క్రైమ్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తోన్నట్లు కనిపిస్తోంది. మంగళవారం నుంచి ఈ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్ మొదలుపెట్టినట్లు సమాచారం.
సుడల్ వెబ్‌సిరీస్ ఫస్ట్ సీజన్ 2022లో రిలీజైంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ వెబ్‌సిరీస్‌కు సెకండ్ సీజన్ వస్తోంది. చైల్డ్ అబ్యూసింగ్ సమస్యను చర్చిస్తూ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా సీజన్ వన్‌ను మేకర్స్ తెరకెక్కించారు. సుడన్ సీజన్ వన్‌లో ఐశ్వర్య రాజేష్, కాథిర్‌తో పాటు పార్తిబన్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.
సంబలూరు సిమెంట్ ఫ్యాక్టరీ వర్కర్ యూనియన్ ప్రెసిడెంట్ షణ్ముగం కూతురు నీలా, పోలీస్ ఆఫీసర్ రెజీనా(శ్రియారెడ్డి) కొడుకు అతిశయం మిస్సింగ్ అవుతారు. అదే ఊరిలో ఉన్న చెరువులో నీలా, అతిశయం శవాలు బయటపడతాయి. మరో పోలీస్ చక్రవర్తి ఇన్వేస్టిగేషన్‌లో నీలా, అతిశయం హత్య చేయబడినట్లు తెలుస్తుంది. ఆ యువ జంటను హత్య చేసింది ఎవరు? నీలా గురించి ఆమె అక్క నందిని (ఐశ్వర్య రాజేష్) తెలుగుసుకున్న నిజాలేమిటి?హంతకుడికి నీలాకు ఉన్న సంబంధం ఏమిటి? తనతో పాటు తన సోదరికి జరిగిన అన్యాయంపై నందిని ఎలా ప్రతీకారం తీర్చుకుంది అన్నదే ఈ మూవీ కథ.
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ మూవీలో వెంకటేష్ భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనిపించింది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. పుష్కర్ - గాయత్రి తమిళంలో విక్రమ్ వేదా సినిమాను రూపొందించారు.
సంబంధిత కథనం