MX Player New Movies Web Series: ఒకే ఓటీటీలోకి కొత్తగాా 100 సినిమాలు, వెబ్ సిరీస్.. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ దూకుడు-amazon mx player new movies web series in 2025 aashram season 3 half ca 2 sixer season 2 hunter season 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mx Player New Movies Web Series: ఒకే ఓటీటీలోకి కొత్తగాా 100 సినిమాలు, వెబ్ సిరీస్.. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ దూకుడు

MX Player New Movies Web Series: ఒకే ఓటీటీలోకి కొత్తగాా 100 సినిమాలు, వెబ్ సిరీస్.. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ దూకుడు

Hari Prasad S HT Telugu

MX Player New Movies Web Series: ఒకే ఓటీటీలోకి ఈ ఏడాది ఏకంగా 100కుపైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. ఈ మధ్యే అమెజాన్ కొనుగోలు చేసిన ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ దూకుడుగా వెళ్తోంది.

ఒకే ఓటీటీలోకి కొత్తగాా 100 సినిమాలు, వెబ్ సిరీస్.. ఎంఎక్స్ ప్లేయర్ దూకుడు

MX Player New Movies Web Series: ఎంఎక్స్ ప్లేయర్ (MX Player) ఓటీటీ తెలుసా? ఈ మధ్యే అమెజాన్ కొనుగోలు చేసింది. ఇందులోని కంటెంట్ మొత్తం ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు. అలాంటి ఓటీటీ 2025లో తమ ప్లాట్‌ఫామ్ లోకి రాబోతున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వివరాలు వెల్లడించింది. ఏకంగా ఒకే ఏడాది 100కుపైగా సినిమాలు, వెబ్ సిరీస్ రానున్నాయి.

ఎంఎక్స్ ప్లేయర్ ఒరిజినల్స్ ఇవే

ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ చాలా రోజులుగా ఉన్నా చాలా మందికి పెద్దగా తెలియదు. అయితే ఈమధ్య అమెజాన్ ఈ ఓటీటీని కొనుగోలు చేసిన తన మినీటీవీతో కలిపేసింది. అప్పటి నుంచీ ఈ ఓటీటీ దూకుడు మరింత పెరిగింది.

తాజాగా ప్రకటించిన కొత్త కంటెంట్ లో పాపులర్ వెబ్ సిరీస్ ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2తోపాటు హంటర్ సీజన్ 2, హాఫ్ సీఏ సీజన్ 2, సిక్సర్ వెబ్ సిరీస్ సీజన్ 2, హు ఈజ్ యువర్ గైనా సీక్వెల్ లాంటివి ఉన్నాయి.

క్రైమ్, క్రైమ్ థ్రిల్లర్, థ్రిల్లర్, డ్రామా, కామెడీ జానర్లలో రూపొందించిన ఈ కంటెంట్ తో 2025లో ఎంఎక్స్ ప్లేయర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు కూడా చెమటలు పట్టించేలా ఉంది.

ఎంఎక్స్ ప్లేయర్ సీక్వెల్స్ ఇవే

ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో వచ్చిన పాపులర్ వెబ్ సిరీస్ ఆశ్రమ్. బాబీ డియోల్ నటించిన ఈ సిరీస్ మూడో సీజన్ రెండో పార్ట్ ఈ ఏడాది రాబోతోంది. ఇదే కాకుండా సునీల్ శెట్టి నటించిన హంటర్ వెబ్ సిరీస్ రెండో సీజన్, గతంలో మినీ టీవీలో వచ్చిన జమ్నాపార్, హాఫ్ సీఏలాంటి వెబ్ సిరీస్ రెండో సీజన్లు కూడా ఈ ఏడాదే ఎంఎక్స్ ప్లేయర్ లోకి రాబోతున్నాయి.

కొత్త సీజన్లే కాదు.. సరికొత్త షోలు కూడా ఉన్నాయి. వీటిలో రైజ్ అండ్ ఫాల్ అనే ఓ రియాల్టీ షో కూడా ఉంది. ఇక భాయ్ - ది గౌరవ్ తివారీ స్టోరీ పేరుతో ఓ దెయ్యాల గురించి తెలుసుకునే ఇన్వెస్టిగేటర్ చుట్టూ తిరిగే కథతో వెబ్ సిరీస్ రానుంది.

ఎంఎక్స్ ప్లేయర్‌లోకి రాబోతున్న కొన్ని ఇంట్రెస్టింగ్ షోస్

హంటర్ వెబ్ సిరీస్ సీజన్ 2

హిప్ హాప్ ఇండియా సీజన్ 2

ఆశ్రమ్ వెబ్ సిరీస్ సీజన్ 3 పార్ట్ 2

భాయ్ ది గౌరవ్ తివారీ స్టోరీ వెబ్ సిరీస్

జమ్నాపార్ సీజన్ 2

మిట్టీ - ఏక్ నయీ పెహచాన్ వెబ్ సిరీస్

రైజ్ అండ్ ఫాల్ రియాల్టీ షో

హాఫ్ సీఏ వెబ్ సిరీస్ సీజన్ 2

సిక్సర్ వెబ్ సిరీస్ సీజన్ 2

హు ఈజ్ యువర్ గైనాక్ సీజన్ 2

క్యాంపస్ బీట్స్ సీజన్ 5

చిడియా ఉడ్ వెబ్ సిరీస్

సంబంధిత కథనం