Amaran OTT Release: ఓటీటీలో టాప్ ట్రెండింగ్ దిశగా దూసుకెళ్తున్న రీసెంట్ బ్లాక్‌బాస్టర్ అమరన్.. ఎక్కడ చూడొచ్చంటే?
Amaran Movie On OTT: అమరన్ మూవీ కోసం గత కొన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్న ప్రేక్షకులు.. ఓటీటీలో ఇప్పుడు ఆ మూవీని చూస్తూ ట్విట్టర్‌లో పాజిటివ్‌గా కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఈ బ్లాక్ బాస్టర్ మూవీ ఓటీటీలో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే?
రీసెంట్ బ్లాక్ బాస్టర్ మూవీ అమరన్ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళ్ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ అమరన్ మూవీ.. అక్టోబరు 31న దీపావళి రోజున విడుదలై బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచింది.
శివ కార్తికేయన్ కెరీర్‌లోనే బెస్ట్
శివ కార్తికేయన్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమా నిలిచిన అమరన్.. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది. ఈ సినిమాకి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించగా.. రాజ్ కమల్ బ్యానర్‌పై కమల్ హాసన్ ఈ సినిమాని నిర్మించారు.
అమరన్ మూవీ రిలీజైన రోజే లక్కీ భాస్కర్, క సినిమాలు రిలీజ్ అవగా.. ఈ రెండూ వారం క్రితమే ఓటీటీలోకి వచ్చాయి. కానీ.. తమిళనాడులో అమరన్ మూవీ మొన్నటి వరకూ థియేటర్లలో నడవడంతో.. ఈ సినిమా ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా వచ్చింది.
ఐదు భాషల్లో ఓటీటీలోకి
అమరన్ సినిమా ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకి కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్ గురువారం నుంచి స్ట్రీమింగ్‌కి ఉంచింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అమరన్ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది.
ముకుంద్ వరదరాజన్‌గా శివ కార్తికేయన్ కనిపించగా.. అతని భార్య ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి నటించింది. ఇద్దరూ నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. మరీ ముఖ్యంగా.. సాయి పల్లవి ఎమోషన్స్ సీన్స్‌తో ప్రేక్షకుల్ని కంటతడి పెట్టేంచేసింది.
కథ, కథనంతో పాటు పాటలు వినసొంపుగా ఉండటంతో దీపావళి విన్నర్‌గా అమరన్ మూవీ నిలిచింది. శివ కార్తికేయన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలవడంతో పాటు.. సౌత్‌లోనూ అతనికి మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.
ట్విట్టర్ మళ్లీ అమరన్ చర్చ
అమరన్ మూవీని థియేటర్లలో మిస్ అయిన వారు.. ఓటీటీ కోసం గత కొన్ని రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లోకి రాగానే.. ఆ మూవిని చూసి ట్విట్టర్‌లో తమ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు.నెటిజన్ల రియాక్షన్స్ చూస్తుంటే.. అతి త్వరలోనే నెట్‌ప్లిక్స్ టాప్ ట్రెండింగ్‌లోకి అమరన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.