Amala Paul Bollywood Entry: ఖైదీ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న అమలాపాల్
Amala Paul Bollywood Entry: సౌత్ హీరోయిన్ అమలాపాల్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఖైదీ హిందీ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో హీరో ఎవరంటే...
Amala Paul Bollywood Entry: మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. కెరీర్‌లో ఫస్ట్‌టైమ్ ఓ హిందీ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అజయ్ దేవ్‌గణ్ స్వీయ దర్శకత్వంలో భోళా పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తమిళంలో కార్తి హీరోగా రూపొందిన ఖైదీ ఆధారంగా భోళా రూపొందనున్నది. ఈ సినిమాలో అమలాపాల్ అతిథి పాత్రలో నటించనున్నది. భోళాలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా కథాగమనంలో కీలకంగా ఉంటుందని సమాచారం. క్యారెక్టర్ నచ్చడంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు.
త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలిసింది. తమిళంతో పోలిస్తే హిందీలో కథ, క్యారెక్టర్స్‌లో చాలా మార్పులు చేస్తూ భోళా రీమేక్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అమలాపాల్ హీరోయిన్‌గా అరంగేట్రం చేసి పదమూడేళ్లు అయినా ఇప్పటివరకు హిందీలో సినిమాలు చేయలేదు. గతంలో బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినా తిరస్కరించింది.
తొలిసారి ఓ రీమేక్ సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. తెలుగులో ఇద్దరమ్మాయిలతో, నాయక్‌తో పాటు పలు సినిమాల్లో కనిపించింది. గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది. తెలుగులో హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఉండదని, కేవలం గ్లామర్ కోణంలోనే కథానాయికల్ని చూస్తారని, పాటల్లో మాత్రమే కనిపించడానికి తీసుకుంటారంటూ టాలీవుడ్‌పై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అమలపాల్.
ప్రస్తుతం మలయాళంలో నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అమలాపాల్ నటిస్తూ నిర్మించిన కడవార్ సినిమా ఇటీవల డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది.