తెలుగులో హీరోయిన్‌గా మంచి క్రెజ్ తెచ్చుకుంది అమలా పాల్. లవ్ ఫెయిల్యూల్, రఘువరన్ బీటెక్, ఇద్దరమ్మాయిలతో, నాయక్ వంటి సినిమాలతో అలరించింది అమలా పాల్. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని, తల్లి మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
అయితే, తన భర్త జగత్ దేశాయ్‌కు తాను హీరోయిన్ అనే విషయం తెలియదని, గర్భవతిని అయ్యాకే తెలిసిందని అమలా పాల్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చింది. తామిద్దరు డేటింగ్‌లో ఉన్నప్పుడు అమలా పాల్ ఒక సౌత్ హీరోయిన్ అనే విషయం జగత్ దేశాయ్‌కు తెలియదని ఈ కథానాయిక తెలిపింది.
జెఎఫ్‌డబ్ల్యూ మూవీ అవార్డ్స్ వేడుకల్లో ఉత్తమ నటిగా క్రిటిక్స్ అవార్డ్ అందుకున్నప్పుడు, ఆమె గర్భవతి అయిన తర్వాతే తెలిసిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది అమలా పాల్.
ఓ ఇంటర్వ్యూలో "జగత్, నేను గోవాలో కలిశాం. అతను గుజరాతీ అయినప్పటికీ, గోవాలోనే స్థిరపడ్డాడు. నాది కేరళ అని చెప్పాను. అయితే, ఆయన దక్షిణాది సినిమాలను ఎక్కువగా చూసే వ్యక్తి కాదు. నేను హీరోయిన్ అనే విషయం అతనికి చెప్పలేదు. అలాగే, నా ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యాక్సెస్ ఇచ్చాను. కొన్ని రోజుల తర్వాత నేను గర్భవతిని అని తెలిసి వెంటనే పెళ్లి చేసుకున్నాం" అని అమలా పాల్ చెప్పింది.
ప్రెగ్నెన్సీ సమయంలో తన గురించి జగత్ సెర్చ్ చేయడం చూసి అమలా పాల్ ఆశ్చర్యపోయిందట. "నేను మాకు పుట్టబోయే బిడ్డకోసం ఎదురుచూస్తున్నసమయంలో జగత్ ఇంట్లో ఉండి నా ఒక్కో సినిమాను చూడటం స్టార్ట్ చేశాడు. ఆయనకు అవార్డ్ షోలు చూడటం అంటే చాలా ఇష్టమట. అందుకే నేను అవార్డ్ ఫంక్షన్స్‌లో అవార్డ్ తీసుకోవడం, రెడ్ కార్పెట్ మీద నడవటం ఆయనకు చూడటం చూసి నేను ఆశ్చర్యపోయాను" అని అమలా పాల్ తెలిపింది.
ఓ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో అమలా పాల్ నడవడం చూసిన జగత్ ఆశ్చర్యపోయాడట. అప్పుడు తనకు అమలా పాల్ ఒక హీరోయిన్ అనే విషయం అంతకుముందు వరకు తెలియదని చెప్పాడట. ఇలా అమలా పాల్ ఒక హీరోయిన్ అనే విషయం తాను గర్భవతిని అయ్యాకే, ఓ ఈవెంట్‌లో నడవడం వల్లే తెలిసిందని ఈ బ్యూటిఫుల్ చెప్పుకొచ్చింది.
ఇకపోతే 2024 జనవరిలో ప్రెగ్నెన్సీని ప్రకటించిన అమలా పాల్ అదే సంవత్సరం జూన్‌లో ఇలై అనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇదెలా ఉంటే, అమలా పాల్ నీల తామర అనే సినిమాతో మలయాళంలో వీర శేఖరన్ చిత్రంతో తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
సంబంధిత కథనం