Amala on Agent: అమల అంత మాట అనేసిందేంటి.. కొడుకు మూవీ డిజాస్టర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Amala on Agent: అమల అంత మాట అనేసిందేంటి.. కొడుకు మూవీ డిజాస్టర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంది.
Amala on Agent: అక్కినేని కుటుంబానికి మరో డిజాస్టర్ ఎదురైంది. అఖిల్ అక్కినేని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. సినిమా రిలీజ్ కోసమే చాలా కాలం వేచి చూడాల్సి రావడం, తొలిరోజే నెగటివ్ టాక్ తో ఏజెంట్ బాక్సాఫీస్ కలెక్షన్లు ఫస్ట్ వీకెండ్ లోనే చాలా తక్కువగా ఉన్నాయి. అఖిల్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎంత హైప్ క్రియేట్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. మూడు రోజుల్లో కలిపి కేవలం రూ.13 కోట్లు మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు కూడా ఇంకా చాలా దూరంలో ఆగిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఫలితం, దానిపై నడుస్తున్న ట్రోలింగ్ పై అఖిల్ తల్లి, నాగార్జున భార్య అమల అక్కినేని స్పందించింది. ఆమె ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది.
ఈ సినిమాలో లోపాలు లేకపోలేవని, అయితే ఓపెన్ మైండ్ తో చూస్తే సినిమా బాగా నచ్చుతుందని ఆమె అనడం విశేషం. "అభద్రతాభావం, ఏదో సాధించాలన్న ఆలోచన నుంచే ట్రోలింగ్ చేస్తుంటారు. ఏజెంట్ మూవీని నేను నిన్న చూశాను. నిజాయతీగా చెప్పాలంటే నాకు నచ్చింది.
సినిమాలో లోపాలు లేవని కాదు. కానీ ఓపెన్ మైండ్ తో చూస్తే నచ్చుతుంది. నేను చూసిన హాల్ పూర్తిగా నిండిపోయింది. అందులో సగం మంది మహిళలు, తల్లులు, బామ్మలే ఉన్నారు. యాక్షన్ సీన్స్ సమయంలో అరుపులు వినిపించాయి. నెక్ట్స్ మూవీ మరింత పెద్దదిగా, మరింత బాగుంటుందని నేను నమ్మకంతో ఉన్నాను" అని అమల పోస్ట్ చేసింది.
ఏజెంట్ రిలీజైనప్పటి నుంచీ ఈ సినిమాపై ట్రోలింగ్ మొదలైంది. అఖిల్ ను ఎంతో మంది విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ఈ సినిమా కోసం నిజానికి అఖిల్ చాలానే కష్టపడ్డాడు. అతని మేకోవర్ చాలా మందికి నచ్చినా.. సినిమా మాత్రం నిరాశ పరిచింది. ఎప్పుడో రెండేళ్ల కిందట షూటింగ్ మొదలైనా.. ఎన్నో వాయిదాల తర్వాత ఇప్పుడు రిలీజైందీ మూవీ.
సంబంధిత కథనం