ఓటీటీలో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్స్- నరకంలోని శిక్షలపై వణుకుపుట్టించే సీన్స్- 7.2 రేటింగ్- ఈ రెండు ఓటీటీల్లో చూసేయండి!-along with the gods the two worlds and the last 49 days ott streaming on netflix amazon prime shows punishments in hell ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్స్- నరకంలోని శిక్షలపై వణుకుపుట్టించే సీన్స్- 7.2 రేటింగ్- ఈ రెండు ఓటీటీల్లో చూసేయండి!

ఓటీటీలో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్స్- నరకంలోని శిక్షలపై వణుకుపుట్టించే సీన్స్- 7.2 రేటింగ్- ఈ రెండు ఓటీటీల్లో చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలో ఫాంటసీ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. నరకంలో విధించే శిక్షలపై రెండు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవి కూడా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అందుబాటులో ఉన్నాయి. అదిరిపోయే రేటింగ్‌తో ఉన్న ఈ రెండు ఓటీటీ సినిమాలను ఇక్కడ చూసేయండి.

ఓటీటీలో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్స్- నరకంలోని శిక్షలపై వణుకుపుట్టించే సీన్స్- 7.2 రేటింగ్- ఈ రెండు ఓటీటీల్లో చూసేయండి!

నరకం చూశాను అని చాలా మంది బాధలో కానీ, సమస్యలు ఫేస్ చేసినపపుడు కానీ వాడుతుంటారు. ఎంతో బాధ, కష్టం, భయం, నొప్పి వంటి భావాలు నరకంలో కలుగుతుంటాయనేది అందరి భావన. చేసిన కర్మల ఫలితానుసారం నరకంలో శిక్షలు పడుతుంటాయని అందరు నమ్ముతారు.

అపరిచితుడు సినిమాలో

మనుషులు చేసిన తప్పులు, నేరాలకు పడే శిక్షలు గరుడు పురాణంలో ఎలా ఉన్నాయో కాస్తా చెబుతూ అపరిచితుడు మూవీలో డైరెక్టర్ శంకర్ చూపించారు. అయితే, పూర్తిగా నరకంలో విధించే శిక్షలపై ఓ సినిమా ఉంటే. ఆ శిక్షలు ఎలా ఉంటాయి అని ఆలోచిస్తే.. ఒకటి కాదు రెండు ఓటీటీ సినిమాల్లో నరకంలో విధించే శిక్షలను చూపించారు.

మనిషి చేసే ఒక్కో తప్పుకు ఎలాంటి శిక్ష ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా, భయంకరమైన సీన్స్‌తో ఈ రెండు ఓటీటీ సినిమాల్లో చూపించారు. ఆ ఓటీటీ సినిమాలే 'ఎలాంగ్ విత్ ది గాడ్స్: ది టూ వరల్డ్స్', 'ఎలాంగ్ విత్ ది గాడ్స్: ది లాస్ట్ 49 డేస్'. ఈ రెండు సినిమాలు సౌత్ కొరియన్ ఫాంటసీ అడ్వెంచర్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కాయి.

బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్

ది టూ వరల్డ్స్ సినిమా 2017లో విడుదల అయితే.. ఆ తర్వాతి సంవత్సరం 2018లోనే ది లాస్ట్ 49 డేస్ రిలీజ్ అయింది. రెండు సినిమాలకు మంచి ఆదరణ లభించింది. ది టూ వరల్డ్స్ సినిమాకు 18.3 మిలియన్ డాలర్ల బడ్జెట్ అయితే బాక్సాఫీస్ వద్ద 109.4 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే, ఐఎమ్‌డీబీ నుంచి 7.2 రేటింగ్ సాధించింది.

ఇక మొదటి పార్ట్‌కు సీక్వెల్‌గా వచ్చిన రెండో సినిమా 'ఎలాంగ్ విత్ ది గాడ్స్: ది లాస్ట్ 49 డేస్'కు 18.3 మిలియన్ డాలర్స్ ఖర్చు అయితే బాక్సాఫీస్ వద్ద 92.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఇక ఐఎమ్‌డీబీ నుంచి 10కి 7.1 రేటింగ్ సంపాదించుకుంది. ఈ రెండు సినిమాలకు కిమ్ యోంగ్ హవా దర్శకత్వం వహించారు.

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

జూ హో మిన్ రాసిన ఎలాంగ్ విత్ ది గాడ్స్ నవల ఆధారంగా ఈ రెండింటిని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు రెండు ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లలో ఎలాంగ్ విత్ ది గాడ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో కొరియన్, అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఈ రెండు అందుబాటులో ఉన్నాయి.

'ఎలాంగ్ విత్ ది గాడ్స్: ది టూ వరల్డ్స్' కథలోకి వెళ్తే.. ఓ ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోయిన హీరో దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వస్తారు. వారు హీరోను నరకానికి తీసుకెళ్తారు.

పునర్జన్మ కావాలంటే

హీరోకు మళ్లీ పునర్జన్మ కావాలంటే అతను చేసిన తప్పులకు తగిన శిక్షలు అనుభవించి అందులో నుంచి బయట పడాలి. అలా అయితే, మరో జన్మ ఉంటుందని చెబుతారు. ఆ శిక్షల నుంచి హీరో బయటపడ్డాడా?, ఆ శిక్షలు ఎలా ఉన్నాయనేదే? ఈ సినిమా కథ.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం