Alone Movie Review: ఎలోన్ మూవీ రివ్యూ - మోహ‌న్‌లాల్ సింగిల్ క్యారెక్ట‌ర్ మూవీ ఎలా ఉందంటే -alone movie telugu review mohanlal mystery thriller movie streaming on disney plus hot star ott review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Alone Movie Telugu Review Mohanlal Mystery Thriller Movie Streaming On Disney Plus Hot Star Ott Review

Alone Movie Review: ఎలోన్ మూవీ రివ్యూ - మోహ‌న్‌లాల్ సింగిల్ క్యారెక్ట‌ర్ మూవీ ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Mar 04, 2023 06:02 AM IST

Alone Movie Review: మోహ‌న్‌లాల్ హీరోగా షాజీ కైలాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఎలోన్ సినిమా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల‌ ముందుకొచ్చింది. సింగిల్‌క్యారెక్ట‌ర్‌తో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే...

ఎలోన్ సినిమా
ఎలోన్ సినిమా

Alone Movie Review: ఎలాంటి ఛాలెంజింగ్‌ పాత్ర‌లోనైనా అల‌వోక‌గా ఒదిగిపోతుంటారు మ‌ల‌యాళ అగ్ర న‌టుడు మోహ‌న్‌లాల్‌(Mohanlal). సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో మోహ‌న్‌లాల్‌ చేయ‌ని క్యారెక్ట‌ర్స్ అంటూ లేవు. ఎన్నో ప్ర‌యోగాలు చేసి ప్రేక్ష‌కుల్ని మెప్పించారు. సింగిల్ క్యారెక్ట‌ర్‌తో మోహ‌న్‌లాల్ చేసిన తాజా చిత్రం ఎలోన్‌. మ‌ల‌యాళ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ షాజీ కైలాస్(Shaji Kailas) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయిన ఎలోన్‌ శుక్ర‌వారం డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సైక‌లాజిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే...

Alone Movie - కాళిదాస్ క‌థ‌

కాళిదాస్ (మోహ‌న్‌లాల్‌) కొచ్చి సిటీలోని ఓ ఖ‌రీదైన‌ ఫ్లాట్‌లో ఒంట‌రిగా కొన్నాళ్లు గ‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. కొవిడ్ కార‌ణంగా న‌గ‌రం మొత్తం లాక్‌డౌన్ విధించ‌బ‌డుతుంది. మ‌రోవైపు కాళిదాస్ ఉండే అపార్ట్‌మెంట్‌లో కొవిడ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో ఒక‌రినొక‌రు క‌లుసుకోకూడ‌ద‌ని రూల్ విధిస్తారు. కాళిదాస్ ఉంటోన్న‌ ఫ్లాట్‌లో ఓ మ‌హిళ‌తో పాటు చిన్నారి వాయిస్‌లు వినిపిస్తుంటాయి. . ఈ ఇల్లు మాది అంటూ అద్దాల‌పై రాత‌లు క‌నిపిస్తాయి.

వాటిని ఎన్నిసార్లు చెరిపివేసినా మ‌ళ్లీ మ‌ళ్లీ క‌నిపిస్తూనే ఉంటాయి. ఆ ఇంట్లో ద‌య్యాలు ఉన్నాయ‌ని కాళిదాస్ న‌మ్ముతుంటాడు. ఆత్మ‌ల రూపంలో ఆ ఇంట్లో ఉన్న‌ది ఎవ‌రో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు. అందులో శ్రీదేవి అనే మ‌హిళ‌తో పాటు ఆమె కూతురు అను ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని కాళిదాస్ అన్వేష‌ణ‌లో తేలుతుంది.

అమాయ‌కులైన వారిని హ‌త్య చేసింది ఎవ‌రో క‌నిపెట్టాల‌ని కాళిదాస్ నిర్ణ‌యించుకుంటాడు. అత‌డి ప‌రిశోధ‌న‌లో తేలిన నిజాలేమిటి? నిజంగానే శ్రీదేవి, అను హ‌త్య చేయ‌బ‌డ్డారా? అదే ఫ్లాట్‌లో ఉంటూ కాళిదాస్ త‌న ఇన్వేస్టిగేష‌న్‌ను ఎలా కొన‌సాగించాడు? కాళిదాస్‌తో ఫోన్ ద్వారా ట‌చ్‌లో ఉన్న హ‌రిభాయ్‌, య‌మున‌, సుసాన్ ఎవ‌రు అన్న‌దే(Alone Movie Review) ఈ సినిమా క‌థ‌.

సింగిల్ క్యారెక్ట‌ర్‌తో...

సింగిల్ క్యారెక్ట‌ర్‌తో ప్ర‌యోగాత్మ‌కంగా రూపొందిన సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా ఇది. ఎలోన్ సినిమాలో మోహ‌న్‌లాల్ త‌ప్ప ఇత‌ర పాత్ర‌లు ఏవి క‌నిపించ‌వు. కేవ‌లం వారి వాయిస్‌లు మాత్ర‌మే వినిపిస్తాయి. హీరోతో ఫోన్‌లో మాట్లాడుతున్న‌ట్లుగా చూపిస్తూ మిగిలిన‌ క్యారెక్ట‌ర్‌ను తెలివిగా మ్యానేజ్ చేశాడు డైరెక్ట‌ర్‌.

సినిమా మొత్తం ఒకే ఫ్లాట్‌లో జ‌రుగుతోంది. ఒకే ప్లేస్‌లో ఉంటూ ఫోన్ ద్వారానే హీరో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని ఎలా సాల్వ్ చేశాడ‌న్న‌ది ద‌ర్శ‌కుడు షాజీ కైలాస్ ఈ సినిమాలో చూపించారు. చివ‌ర‌లో మోహ‌న్‌లాల్ క్యారెక్ట‌ర్‌లో పెద్ద ట్విస్ట్ ఇచ్చి స‌ర్‌ప్రైజింగ్‌ క్లైమాక్స్‌తో ఎండ్ చేశారు. ఆ ట్విస్ట్ ఏమిట‌న్న‌ది సినిమాలో చూడాల్సిందే.

సాగ‌తీత...

సింగిల్ క్యారెక్ట‌ర్‌తో సినిమా చేయాల‌న్న ద‌ర్శ‌కుడి ఆలోచ‌న బాగుంది. మోహ‌న్‌లాల్ లాంటి వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ను ఎంచుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు స‌గం విజ‌యం సాధించాడు. లాక్‌డౌన్ నేప‌థ్యం కూడా షాజీ కైలాస్ అనుకున్న క‌థ‌కు యాప్ట్ అయ్యింది. అన్ని బాగున్నా క‌థ విష‌యంలోనే ద‌ర్శ‌కుడు స‌రైన వ‌ర్క్ చేయ‌లేదు. స్టార్టింగ్ టూ ఎండింగ్ వ‌ర‌కు ఒకే పాయింట్‌ను సాగ‌దీశాడు.

రెండు గంట‌లు బోర్‌...

త‌న ఇంట్లో ఆత్మ‌లున్నాయ‌ని మోహ‌న్‌లాల్ భ‌య‌ప‌డే స‌న్నివేశాలు, ఇన్వేస్టిగేష‌న్ మొత్తం స‌హ‌జ‌త్వానికి దూరంగా సాగుతుంది. పేరుకే సైక‌లాజిక‌ల్ హార‌ర్‌ థ్రిల్ల‌ర్ అయినా అటు భ‌య‌పెట్ట‌లేక‌, ఇటు థ్రిల్‌ను పంచ‌క సినిమా(Alone Movie Review) చ‌తికిలా ప‌డింది.

సింగిల్ క్యారెక్ట‌ర్‌తో సినిమా చేయాల‌ని అనుకున్న‌ప్పుడు మెయిన్‌గా లెంగ్త్‌పై ఫోక‌స్ పెట్టాలి. ఈసినిమా నిడివి రెండు గంట‌లు ఉండ‌టం మైన‌స్‌గా మారింది. క్లైమాక్స్ ట్విస్ట్ ఒక్క‌టే ఈసినిమాకు బ‌లంగా నిలిచింది. కానీ ఆ ఒక్క ట్విస్ట్ కోసం రెండు గంట‌ల సినిమాను భ‌రించ‌డం క‌ష్ట‌మే.

మోహ‌న్‌లాల్ వ‌న్‌మెన్‌షో...

మోహ‌న్‌లాల్ వ‌న్‌మెన్ షో ఇది. ముందే చెప్పిన‌ట్లుగా ఆయ‌న త‌ప్ప ఈ సినిమాలో ఇత‌ర పాత్ర‌లు ఉండ‌వు. సింగిల్ క్యారెక్ట‌ర్‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించేందుకు మోహ‌న్‌లాల్ శాయ‌శ‌క్తుల క‌ష్ట‌ప‌డ్డారు.కానీ క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డంతో ఆయ‌న శ్ర‌మ మొత్తం వృథాగానే మారింది.

ప్ర‌యోగం ఫ‌లించ‌లేదు...

మోహ‌న్‌లాల్ త‌ప్ప ఎలోన్ సినిమాలో చెప్పుకోవ‌డానికి ఎలాంటి ప్ల‌స్ పాయింట్స్ లేవు. ఆయ‌న చేసిన ఈ సింగిల్ క్యారెక్ట‌ర్ ప్ర‌యోగం పూర్తిగా బెడిసికొట్టింది.

రేటింగ్‌: 2/5

IPL_Entry_Point