OTT Crime Thriller: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- 4 భాషల్లో రెండున్నరేళ్లకు స్ట్రీమింగ్- ఇక్కడ చూడండి!
OTT Crime Thriller Alluri Streaming: ఓటీటీలో ఇదివరకే స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అల్లూరి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ అందుకుంది. ఇప్పుడు మరో ఫ్లాట్‌ఫామ్‌లో అల్లూరి ఓటీటీ రిలీజ్ అయింది. అది కూడా సుమారు రెండున్నరేళ్లకు నాలుగు భాషలో అల్లూరి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
Telugu Crime Thriller Movie OTT Release: ఓటీటీలో సినిమాల జాతర జోరుగా సాగుతోంది. ఒక ఓటీటీలోని సినిమాలు మరో ప్లాట్‌ఫామ్‌లో దర్శనం ఇస్తున్నాయి. థియేటర్లలో విడుదలైన నెలలోపే కొన్ని సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే మరో ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.
సీరియస్ రోల్ చేసిన హీరో
అయితే, ఇప్పుడున్నంతగా ఓటీటీల హవా మూడు, నాలుగేళ్ల క్రితం లేదు. అందుకే అప్పుడు థియేటర్, ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలను సైతం ఇప్పుడు మరో ఓటీటీలోకి దించుతున్నారు. రీసెంట్‌గా అలా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీనే అల్లూరి. సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ వంటి సినిమాలతో ఆడియెన్స్‌ను విపరీతంగా ఎంటర్‌టైన్ చేసిన హీరో శ్రీ విష్ణు నటించిన మూవీ ఇది.
ఇప్పుడు లవ్ రొమాంటిక్, కామెడీ జోనర్‌లో సినిమాలు తీస్తూ పైకి చెప్పి చెప్పని డైలాగ్‌లతో కడుపుబ్బా నవ్వించే శ్రీ విష్ణు సీరియస్ రోల్ చేసిన సినిమానే అల్లూరి. శ్రీ విష్ణు మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్‌గా నటించిన అల్లూరి మూవీతో డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్‌గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
అల్లూరి బడ్జెట్, కలెక్షన్స్, రేటింగ్
మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎస్ ప్రదీప్ వర్మ కథ, దర్శకత్వం వహించిన అల్లూరి సినిమాలో హీరోహీరోయిన్లతోపాటు నవీనా రెడ్డి, జయవాణి, తనికెళ్ల భరణి, సుమన్, మధుసుదన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృథ్వీరాజ్, రవి వర్మ, వాసు ఇంటూరి, వెన్నెల రామరావు, శ్రీనివాస్ వడ్లమాని ఇతర కీలక పాత్రలు పోషించారు.
బెక్కం వేణు గోపాల్ నిర్మించిన అల్లూరి సినిమాకు రూ. 5 కోట్ల బడ్జెట్ అయితే బాక్సాఫీస్ వద్ద రూ. 7.72 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అంటే, దాదాపుగా కమర్షియల్ హిట్‌గా నిలిచింది అల్లూరి మూవీ. అలాగే, ఐఎమ్‌డీబీ నుంచి 10కి 5.6 రేటింగ్ సాధించిన అల్లూరి సినిమాను సుమారుగా 70 శాతం మంది గూగుల్ యూజర్స్ లైక్ చేశారు.
ఆహా ఓటీటీతోపాటు
ఇక 2022 సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదలైన అల్లూరి మూవీ ఆ నెల తర్వాత అక్టోబర్ 7న ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది. ఆహాలో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న అల్లూరి ఇప్పుడు మరో ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో అల్లూరి ఓటీటీ రిలీజ్ అయింది. మార్చి 21 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి 4 భాషల్లో అల్లూరి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
అంటే, దాదాపు రెండున్నరేళ్లకు మరో ఓటీటీలోకి అల్లూరి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్ రెండు ఓటీటీల్లో అల్లూరి అందుబాటులో ఉంది. ఇక అల్లూరి కథ విషయానికొస్తే.. సీతారామరాజు (శ్రీ విష్ణు) ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అతనికి ప్రమోషన్స్ కంటే ట్రాన్స్‌ఫర్సే ఎక్కువగా ఉంటాయి.
అల్లూరి కథ
దేశంలో పొంచి ఉన్న టెర్రరిస్ట్‌లను, వారి ప్లాన్‌లను సీతారామరాజు ఎలా తప్పి కొట్టాడు?, క్రైమ్‌ను ఎలా కంట్రోల్ చేశాడు? ఈ క్రమంలో సీతారామరాజు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ? ప్రేమించి పెళ్లి చేసుకున్న సంధ్య (కయాదు లోహర్)కు ఏమైంది?, సీతారామరాజు జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనే అంశాలతో అల్లూరి సాగుతుంది.
సంబంధిత కథనం