Allu Sirish Movie Release Date: అను ఇమ్మాన్యూయేల్‌తో అల్లు శిరీష్ రొమాన్స్.. సినిమా విడుదల కన్ఫార్మ్-allu sirish new movie will release on 2022 november 4th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Sirish New Movie Will Release On 2022 November 4th

Allu Sirish Movie Release Date: అను ఇమ్మాన్యూయేల్‌తో అల్లు శిరీష్ రొమాన్స్.. సినిమా విడుదల కన్ఫార్మ్

Maragani Govardhan HT Telugu
Sep 23, 2022 05:45 PM IST

Allu Sirish New Movie: గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు శిరీష్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.

అల్లు శిరీష్ కొత్త చిత్రం విడుదల తేదీ ఫిక్స్
అల్లు శిరీష్ కొత్త చిత్రం విడుదల తేదీ ఫిక్స్ (Twitter)

Allu Sirish Movie on November 4th: అల్లు శిరీష్ ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఏబీసీడీ అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో విరామం తీసుకున్న అల్లు శిరీష్.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్‌గా చేస్తోంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అయితే టైటిల్ ఇంకా ఖరారు చేయని ఈ సినిమాకు సంబంధించిన పలు ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది.

అల్లు శిరీష్ నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. నవంబరు 4వ తేదీని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, టైటిల్‌ను ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. ఫిల్మ్ వర్గాల సమచారం ప్రకారం ఈ సినిమాకు ప్రేమ కాదంట అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

గౌరవం చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన అల్లు శిరీష్.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథలను ఎంచుకుని ప్రేక్షకులను అలరించాడు. అయితే చివరగా ఏబీసీడీ సినిమాలో కనిపించిన ఈ హీరో.. గీతా ఆర్ట్స్ మూవీతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ దశలో ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్