Buddy OTT: తెలుగు లేటెస్ట్ ఫాంట‌సీ యాక్ష‌న్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-allu sirish fantasy action movie buddy streaming rights acquired by netflix telugu ott gayatri bhardwaj ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Buddy Ott: తెలుగు లేటెస్ట్ ఫాంట‌సీ యాక్ష‌న్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Buddy OTT: తెలుగు లేటెస్ట్ ఫాంట‌సీ యాక్ష‌న్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Aug 05, 2024 06:15 AM IST

Buddy OTT: అల్లు శిరీష్ హీరోగా న‌టించిన బ‌డ్డీ మూవీ డిజిజ‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. ఈ ఫాంట‌సీ యాక్ష‌న్ ల‌వ్ స్టోరీ సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం.

బడ్డీ ఓటీటీ
బడ్డీ ఓటీటీ

Buddy OTT: అల్లు శిరీష్ హీరోగా న‌టించిన బ‌డ్డీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స‌యింది. ఫాంట‌సీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ గ‌త శుక్ర‌వారం (ఆగ‌స్ట్ 2న‌) రిలీజైంది. శామ్ ఆంటోన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో గ్రాయ‌త్రి భ‌ర‌ద్వాజ్‌, ప్రిషా రాజేష్ సింగ్‌ హీరోయిన్లుగా న‌టించారు.

త‌మిళంలో ఆర్య హీరోగా 2021లో విడుద‌లైన‌ టెడ్డీ మూవీకి రీమేక్‌గా బ‌డ్డీ రూపొందింది. బ‌డ్డీతో దాదాపు రెండేళ్ల త‌ర్వాత అల్లు శిరీష్ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఫ‌స్ట్ టైమ్ యాక్ష‌న్ రోల్‌లో క‌నిపించాడు. కానీ అత‌డికి ఈ మూవీ స‌క్సెస్‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయింది.

నెట్‌ఫ్లిక్స్‌లో...

బ‌డ్డీ మూవీ డిజిట‌ల్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగు వారాల్లోనే బ‌డ్డీ ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో అల్లు శిరీష్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో బ‌డ్డీ రిలీజ్ అవుతుంద‌ని తెలిసింది. ఆగ‌స్ట్ లాస్ట్ వీక్‌లో బ‌డ్డీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఆఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్న‌ట్లు స‌మాచారం.

పైలెట్ ప్రేమ‌క‌థ‌...

బ‌డ్డీ మూవీలో ఆదిత్య అనే పైలెట్ పాత్ర‌లో అల్లు శిరీష్ క‌నిపించాడు. ఎయిర్‌లైన్స్‌లోనే ప‌నిచేసే ప‌ల్ల‌విని (గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్‌) ఆదిత్య ప్రేమిస్తాడు. అనుకోకుండా ప‌ల్ల‌వి కార‌ణంగా ఆదిత్య ఉద్యోగం పోతుంది.

ఆదిత్య‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌డ‌మే కాకుండా త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను అత‌డికి చెప్పాల‌నుకొని బ‌య‌లుదేరిన ప‌ల్ల‌వి క‌నిపించ‌కుండా పోతుంది. ప‌ల్ల‌వి మిస్సింగ్ వెనుక ఉన్న మిస్ట‌రీని ఆదిత్య ఎలా ఛేదించాడు? ప‌ల్ల‌వి ఆత్మ ఓ టెడ్డీ బేర్‌లోకి ఎలా వ‌చ్చింది? టెడ్డీ బేర్ స‌హాయంతో హ్యూమ‌న్ ఆర్గాన్స్ ఇల్లీగ‌ల్ బిజినెస్ చేసే డాక్ట‌ర్ అర్జున్ కుమార్ వ‌ర్మ దురాగ‌తాల‌ను ఆదిత్య ఎలా బ‌య‌ట‌పెట్టాడు? అన్న‌దే బ‌డ్డీ మూవీ క‌థ‌.

మిక్స్‌డ్ టాక్‌...

కాన్సెప్ట్ బాగున్నా హీరో పాత్ర‌కు స‌రైన ప్రాధాన్య‌త లేక‌పోవ‌డం, ఎమోష‌న్స్ బ‌లంగా పండ‌క‌పోవ‌డంతో బ‌డ్డీ మూవీ మిక్స్‌డ్ టాక్‌నుతెచ్చుకున్న‌ది. యాక్ష‌న్ సీక్వెన్స్‌లు మాత్రం బాగున్నాయ‌నే కామెంట్స్ వినిపించాయి. బ‌డ్డీ మూవీలో రంగం ఫేమ్ అమీర్ అజ్మ‌ల్ విల‌న్‌గా న‌టించాడు. అలీ కీల‌క పాత్ర పోషించాడు. హిప్ హాప్ త‌మిళ మ్యూజిక్ అందించాడు. టికెట్ రేట్ల‌ను త‌గ్గిస్తూ ఈ మూవీని రిలీజ్ చేశారు.

సందీప్ కిష‌న్ హీరో...

బ‌డ్డీ మూవీలో తొలుత సందీప్ కిష‌న్ హీరోగా ఎంపిక‌య్యాడు. సందీప్ కిష‌న్‌పై ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఆ త‌ర్వాత అనివార్య కార‌ణాల వ‌ల్ల సందీప్‌కిష‌న్ త‌ప్పుకోవ‌డంతో ఈ ప్రాజెక్ట్‌లోకి అల్లు శిరీష్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. కాగా బ‌డ్డీ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కాగా...త‌మిళ ఒరిజిన‌ల్ టెడ్డీ మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. కొవిడ్ కార‌ణంగా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ద్వారా ఈ మూవీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. తెలుగులోనూ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

టాపిక్