Tollywood: యంగ్ హీరోల బాక్సాఫీస్ వార్ - ఈ వారం థియేటర్లలో తొమ్మిది సినిమాలు రిలీజ్
Tollywood: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా తొమ్మిది సినిమాలు పోటీపడబోతున్నాయి. యంగ్ హీరోలు నటించిన ఆ సినిమాలు ఏవంటే?

Tollywood: ఈ వారం థియేటర్లలో ఏకంగా తొమ్మిది సినిమాలు సందడి చేయబోతున్నాయి. అల్లు శిరీష్, వరుణ్ సందేశ్‌తో పాటు మరికొందరు యంగ్ హీరోలు నటిస్తోన్న డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే?
అల్లు శిరీష్ బడ్డీ
బడ్డీ (Buddy movie) మూవీతో దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ ఆగస్ట్ 2న థియేటర్లలోకి వస్తోంది. బడ్డీ మూవీకి కోలీవుడ్ అగ్ర నిర్మాత కేఈ జ్ఞానవేళ్ రాజా ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్నాడు. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లను తగ్గించి బడ్డీ మూవీని మేకర్స్ రిలీజ్ చేస్తోన్నారు.
వరుణ్ సందేశ్ విరాజి
నింద తర్వాత వరుణ్ సందేశ్ విరాజి పేరుతో ఓ ప్రయోగం చేయబోతున్నాడు. ఇందులో వరుణ్ సందేశ్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. సుకుమార్ శిష్యుడు ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహిస్తోన్న విరాజి మూవీ ఈ శుక్రవారమే థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. అనుకోకుండా మూతపడిన పిచ్చాసుపత్రిలో అడుగుపెట్టిన కొంతమంది స్నేహితులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అక్కడ వారికి పరిచయమైన ఆండీ ఎవరనే పాయింట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకున్నది.
విజయ్ ఆంటోనీ తుఫాన్...
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తోన్న తమిళ డబ్బింగ్ మూవీ తుఫాన్ ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. పొయెటిక్ యాక్షన్ అనే వినూత్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు విజయ్ మిల్టన్ ఈ మూవీని రూపొందిస్తోన్నాడు. ఈ మూవీలో సత్యరాజ్, శరత్‌కుమార్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు.
శివంభజే...
అశ్విన్‌బాబు, దిగంగనా సూర్యవన్షీ జంటగా నటిస్తోన్న శివం భజే మూవీ ఓ రోజు ముందుగానే గురువారం (ఆగస్ట్ 1న) విడుదల అవుతోంది. డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి ఆఫ్సర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో హైపర్ ఆది, మురళీశర్మ కీలక పాత్రలు పోషిస్తోన్నారు.
విజయ్ భాస్కర్ ఉషా పరిణయం...
నువ్వు నాకు నచ్చావ్, నువ్వే కావాలి ఫేమ్ విజయ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తోన్న ఉషా పరిణయం ఈ మూవీ ఆగస్ట్ 2న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీతో విజయ్ భాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా నటిస్తోన్నాడు. తాన్వి ఆకాంక్ష కథానాయికగా పరిచయం అవుతోంది. ఈ మూవీని స్వయంగా విజయ్ భాస్కర్ ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.
ఈ సినిమాలతో పాటు అలనాటి రామచంద్రుడు, యావరేజ్ స్టూడెంట్ నాని, లారి సినిమాలు ఈ శుక్రవారమే థియేటర్లలో రిలీజ్ అవుతోన్నాయి.
నాని, సమంత జంటగా నటించి ఏటో వెళ్లిపోయింది మనసు మూవీ ఆగస్ట్ 2న థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి గౌతమ్ మీనన్ దర్శకుడు.
టాపిక్