Allu Arjun Warning : నా సినిమాలో చేయకుంటే చంపేస్తా.. కేశవకు బన్నీ వార్నింగ్-allu arjun warning to pushpa fame jagadeesh prathap bandari in aha telugu indian idol 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun Warning To Pushpa Fame Jagadeesh Prathap Bandari In Aha Telugu Indian Idol 2

Allu Arjun Warning : నా సినిమాలో చేయకుంటే చంపేస్తా.. కేశవకు బన్నీ వార్నింగ్

Anand Sai HT Telugu
May 29, 2023 10:35 AM IST

Pushpa 2 Allu Arjun : పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తోపాటుగా కేశవ పాత్రలో నటించిన జగదీశ్ ప్రతాప్ బండారికి చాలా పేరు వచ్చింది. జగదీశ్ ప్రతాప్ బండారి ప్రధాన పాత్రలో ఇటీవలే సత్తి గాని రెండెకరాలు సినిమా విడుదలైంది. అయితే తాజాగా జగదీశ్ కు అల్లు అర్జున్ వార్నింగ్ ఇచ్చాడు.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్, జగదీశ్
పుష్ప సినిమాలో అల్లు అర్జున్, జగదీశ్ (Twitter)

పుష్ప సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) పాత్రకు ఎంతటి పేరు వచ్చిందో.. హీరో పక్కనే ఉంటూ కామెడీ చేసిన కేశవ పాత్రకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. ఈ క్యారెక్టర్ చేసింది నటుడు జగదీష్ ప్రతాప్ బండారి. పుష్పలో అల్లు అర్జున్ తోపాటే ఉంటాడు. అయితే తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2(Telugu Indian Idol 2)లో బన్నీ, జగదీశ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఆసక్తిగా ఉన్నాయి.

తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫినాలేకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇదే షోకు జగదీశ్ ప్రతాప్ బండారి కూడా వచ్చాడు. సత్తి గాని రెండెకరాలు సినిమా ప్రమోషన్లో భాగంగా హాజరయ్యాడు. వచ్చి రాగానే.. పుష్ప అన్న నాకో రెండు ఎకరాలు ఉన్నాయి.. కొంటారో లేదోనని వచ్చుండా అంటాడు. తప్పకుండా చేస్తాను గానీ.. చూసిందా చూడలేదా అని ఫన్నీగా అడుగుతాడు బన్నీ.

అయితే ఈ సందర్భంగా జగదీశ్ తో కాసేపు సరదాగా మాట్లాడుతాడు అల్లు అర్జున్. నువ్ గుర్తుపెట్టుకో.. నువ్ సత్తి కాదు.. కేశవే. త్వరగా సినిమా ప్రమోషన్ ముగించుకుని అక్కడ షుటింగ్ కు రమ్మని చెబుతాడు. అందరూ వెయిట్ చేస్తున్నారని తెలియజేశాడు. ఇప్పుడు హీరోగా సినిమా చేశానని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయనని ఓవరాక్షన్ ఏం చేయవు కదా అని అడిగాడు బన్నీ. హీరోగా సినిమా సక్సెస్ అయిందని.. క్యారెక్టర్ చేయనని చెబితే చంపేస్తానని సరదాగా అన్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది.

ఇటీవలే జగదీశ్ ప్రతాప్ బండారి ప్రధాన పాత్రలో వచ్చిన సత్తిగాని రెండెకరాలు సినిమా ఆహాలో విడుదలైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా జగదీశ్ కార్యక్రమానికి వెళ్లాడు. పుష్ప సినిమా తర్వాత జగదీశ్ క్రేజ్ పెరిగిపోయింది. కొన్ని సినిమాల్లో నటించేందుకు అవకాశాలు కూడా వచ్చాయి.

‘పుష్ప’ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దాని సీక్వెల్ పై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై అనేక గాసిప్స్ వినిపిస్తున్నాయి. సీక్వెల్ లో హీరోయిన్ పాత్ర ముగియడం, పుష్పరాజ్(Pushpa Raj) విదేశాలకు వెళ్లడం, స్టార్ హీరోయిన్ ఐటెం డ్యాన్స్ చేయడం ఇలా ఎన్నో గాసిప్స్ ఉన్నాయి. ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తున్నారు. అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, డాలీ ధనంజయ్ ఉన్నారు. షూటింగ్ జోరుగా సాగుతోంది. కొత్త ఆర్టిస్టులు కూడా తారాగణంలోకి వస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

2023లోనే ఈ సినిమా విడుదలవుతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు కొన్ని మీడియాల్లో కథనం ప్రచురితమైంది. పుష్ప 2 సినిమా(Pushpa 2) విడుదల గురించి చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు . దర్శకుడు సుకుమార్(Director Sukumar) చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమా తీస్తున్నందున సహజంగానే ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి 2024లో పుష్ప 2 సినిమా విడుదల కానుందని వినిపిస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచే అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.