Allu Arjun: పీరియాడిక్ డ్రామాతో బన్నీ-త్రివిక్రమ్ మూవీ.. ఫ్లాష్‍బ్యాక్ మాత్రం మరో లెవెల్
Allu Arjun Trivikram: పుష్ప సినిమాతో గ్లోబల్ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని టాక్ వస్తోంది. దీంతో ఆ మూవీ జోనర్ గురించి ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.
Allu Arjun Trivikram Periodic Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మెగా ఫ్యామిలీ సపోర్టుతో సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్డాడు. గంగోత్రి సినిమాతో హీరోగా సినీ ప్రయాణం మొదలు పెట్టిన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్‍గా సొంతంగా ఎదిగాడు. ఆర్య, బన్ని, హ్యాపీ, ఆర్య 2, బద్రీనాథ్, ఇద్దరమ్మాయిలతో తదితర చిత్రాల్లో వెరీ స్టైలిష్‍గా కనిపించి.. నటన, డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్. ఫలితంగా అశేష అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప (Pushpa) సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు బన్ని.
ట్రెండింగ్ వార్తలు
'పుష్ప: ది రైజ్' (Pushpa: The Rise) సినిమాలో నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, స్వాగ్‍కు ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యారు. అంతేకాకుండా ఆయన స్టైల్‍లో చెప్పిన నీయవ్వ తగ్గేదేలే అనే డైలాగ్‍ను ఇండియాలోనే కాకుండా విదేశీయులు సైతం రీక్రియేట్ చేశారు. ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్న అల్లు అర్జున్ నటనకు గానూ ఇటీవల జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో (69th National Film Awards) ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కించుకున్నాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) (Pushpa: The Rule) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇప్పటికే తెగ ఆకట్టుకుంది. ఇక అల్లు అర్జున్ మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని ఎప్పటి నుంచో టాక్ వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్‍లో నాలుగోసారి (Allu Arjun Trivikram Fourth Movie) వస్తున్న ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామా అని టాక్. పైగా మూవీలో వచ్చే ఫ్లాష్‍బ్యాక్‍లో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా భారీగా నిర్మించనున్నాయి. మూవీ టైటిల్, ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. దీనికి తమన్ సంగీతం అందిస్తాడని టాక్. కాగా బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‍లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు మంచి హిట్స్ సాధించాయి.