Allu Arjun: నేడు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్న అల్లు అర్జున్! భారీగా బందోబస్తు-allu arjun to visit sandhya theatre stampede victim sri tej in hospital today ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun: నేడు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్న అల్లు అర్జున్! భారీగా బందోబస్తు

Allu Arjun: నేడు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్న అల్లు అర్జున్! భారీగా బందోబస్తు

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 07, 2025 09:02 AM IST

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‍ను అల్లు అర్జున్ కలవనున్నారని సమాచారం. ఇందుకోసం ఆసుపత్రికి నేడు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఆ వివరాలివే.

Allu Arjun: నేడు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్న అల్లు అర్జున్! భారీగా బందోబస్తు
Allu Arjun: నేడు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్న అల్లు అర్జున్! భారీగా బందోబస్తు

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‍కు చికిత్స కొనసాగుతోంది. అతడు క్రమంగా కోలుకుంటున్నాడు. డిసెంబర్ 4వ తేదీన జరిగిన ఈ ఘటనలో రేవతి మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍కు ఇటీవలే రెగ్యులర్ బెయిల్ వచ్చింది. దీంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‍ను చూసేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. నేడు (జనవరి 7) ఆసుపత్రికి వెళ్లనున్నారనే సమాచారం బయటికి వచ్చింది.

yearly horoscope entry point

ఏ సమయానికి వెళ్లొచ్చంటే..! భారీ బందోబస్తు

శ్రీతేజ్‍ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ నేడు కిమ్స్ ఆసుపత్రికి వెళతారని సమాచారం వెల్లడైంది. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య ఆయన ఆసుపత్రికి చేరుకుంటారనే అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ వస్తున్నారని తెలియడంతో కిమ్స్ ఆసుపత్రి వద్ద భద్రతను పోలీసులు ఇప్పటికే కట్టుదిట్టం చేస్తున్నారు. ఎలాంటి ఘనటలు జరగకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలీసుల నోటీసు తర్వాత..

శ్రీతేజ్‍ను చూసేందుకు ఆసుపత్రికి వెళితే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని రాంగోపాల్ పేట పోలీసులు.. అల్లు అర్జున్‍కు ఇటీవలే నోటీసులు ఇచ్చారు. ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఏవైనా అనుకోని ఘటన జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. అందుకే వెళ్లాలనుకుంటే భద్రతా ఏర్పాట్లు కోసం ముందే తమకు చెప్పాలని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత నేడు ఆసుపత్రికి వెళ్లాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఓ రోజు జైలులో గడిపారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా.. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన బయటికి వచ్చారు. ఆ తర్వాత విచారణ కోసం చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్‍కు కూడా అల్లు అర్జున్ వెళ్లారు. గత వారమే ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. వ్యక్తిగత పూచికత్తు, కొన్ని షరతులతో బెయిల్ ఇచ్చింది. బెయిల్ పనులను పూర్తి చేసుకునేందుకు మరోసారి నాంపల్లి కోర్టుకు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‍కు బన్నీ వెళ్లారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబానికి రూ.2కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు నిర్మాత అల్లు అరవింద్. అల్లు అర్జున్ రూ.కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ రూ.50లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. మృతురాలు రేవతి భర్త భాస్కర్‌కు చెక్కులు అందజేశారు. శ్రీతేజ్ పరిస్థితిని ఆసుపత్రికి వెళ్లి తెలుసుకున్నారు అరవింద్. అలాగే చాలా మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా శ్రీతేజ్‍ను చూసేందుకు వెళ్లారు.

Whats_app_banner

సంబంధిత కథనం