Allu Arjun Threads: వావ్.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ యాక్టర్ అల్లు అర్జున్
Allu Arjun Threads: థ్రెడ్స్ లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దూసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకూ ఇండియాలో ఏ ఇతర నటుడికీ సాధ్యం కాని అరుదైన ఘనతను అతడు సొంతం చేసుకున్నాడు.
Allu Arjun Threads: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మధ్యే మెటా నుంచి ట్విటర్ కు పోటీగా వచ్చిన థ్రెడ్స్ యాప్ లో అతడు ఏ ఇండియన్ యాక్టర్ కూ సాధ్యం కాని రికార్డు క్రియేట్ చేశాడు. థ్రెడ్స్ యాప్ లో అల్లు అర్జున్ ఫాలోవర్ల సంఖ్య 10 లక్షలు దాటింది. ఇలా థ్రెడ్స్ లో మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి నటుడిగా అతడు నిలిచాడు.
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి యువతను అట్రాక్ట్ చేసే యాప్స్ కలిగి ఉన్న మెటా నుంచి ఈ థ్రెడ్స్ రావడంతో ఈ యాప్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే కోట్ల మంది ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు. యాప్ రిలీజైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల డౌన్‌లోడ్స్ జరగగా.. అందులో 22 శాతం కేవలం ఇండియా నుంచే కావడం విశేషం.
దీంతో సహజంగా థ్రెడ్స్ లో ఇండియన్ సెలబ్రిటీల ఫాలోవర్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. వాళ్లలో అల్లు అర్జున్ టాప్ లో ఉండటం నిజంగా విశేషమే. ఈ విషయాన్ని అల్లు అర్జున్ టీమ్ సోమవారం (జులై 24) వెల్లడించింది. థ్రెడ్స్ యాప్ లో అల్లు అర్జున్ అకౌంట్.. alluarjunonline పేరుతో ఉంది. అందులో అతని ఫాలోవర్ల సంఖ్య 1 మిలియన్ దాటినట్లు కనిపిస్తోంది.
ఇక బన్నీ ఈ మధ్యే బేబీ సక్సెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తాను నటిస్తున్న పుష్ప 2 మూవీ నుంచి ఓ డైలాగ్ రివీల్ చేశాడు. ఈడంతా ఒకటే రూల్ మీద జరుగుతుండాది. పుష్ప గాడి రూల్ అంటూ ఆ డైలాగ్ చెప్పేసరికి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఖుష్ అయ్యారు. ఇక టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా అల్లు అర్జున్ అభిప్రాయపడ్డాడు.
సంబంధిత కథనం