Pushpa 2 Runtime: ఆల్‌టైమ్ రికార్డ్‌పై కన్నేసిన పుష్ప-2.. రిలీజ్ ముంగిట అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఉత్సాహానిచ్చే వార్త
pushpa 2 the rule release date: అల్లు అర్జున్ సినిమా కోసం మూడేళ్ల నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నారు. దాంతో పుష్ప-2 రన్‌టైమ్ విషయంలో దర్శకుడు సుకుమార్ సాహసం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 ఆల్‌టైమ్ రికార్డ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న ‘పుష్ప: ది రూల్’ థియేటర్లలోకి రాబోతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఆదివారం (నవంబరు 16) నుంచి ప్రమోషన్స్‌ని ప్రారంభించనుంది.
దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్స్‌ని పుష్ప-2 చిత్ర యూనిట్ చేయనుండగా.. బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం సాయంత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే అధికారిక ప్రకటనని కూడా మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది.
డబ్బింగ్ వర్క్ పెండింగ్
పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్‌కి జంటగా రష్మిక మంధాన నటించగా.. క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయిపోయిందని.. సెకండ్ హాఫ్ డబ్బింగ్ వర్క్ జరుగుతున్నట్లు రెండు రోజుల క్రితం రష్మిక మంధాన క్లారిటీ ఇచ్చింది.
పుష్ప-2 రన్‌టైమ్ గురించి కూడా ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కోసం 2021 నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో.. మూవీలో ఎలాంటి కన్‌ప్యూజన్‌కి తావు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో క్లారిటీగా చూపించాలని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాంతో రన్‌టైమ్ కూడా భారీగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది.
యానిమల్ మూవీ స్ఫూర్తి
సాధారణంగా ఇప్పుడు సినిమాలు 2 గంటల నుంచి నుంచి 2 గంటల 15 నిమిషాల వరకూ రన్‌టైమ్‌తో వస్తున్నాయి. అయితే.. గత ఏడాది విడుదలైన యానిమల్ మూవీ ఏకంగా 3.21 గంటలు ఉంది. అయినప్పటికీ ఆ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ సూపర్ హిట్‌గా నిలిపారు. ఈ ధైర్యంతో సుకుమార్ కూడా సాహసం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఓవరాల్‌గా పుష్ప-2 రన్‌టైమ్ 3.40 గంటల వరకూ పెరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా ప్యాచ్ వర్క్ కూడా యాడ్ చేయాల్సి ఉందని చిత్ర యూనిట్ చెప్తోంది. మరీ ఇంతసేపు ప్రేక్షకులు ఓపికగా థియేటర్లలో చూడగలరా? అనేది ఇప్పుడు సందేహం.
టేకింగ్‌లో కొత్తదనం చూపించే సుకుమార్.. ప్రేక్షకుల్ని 3.40 గంటల సేపు కూర్చోబెట్టగలడని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ రన్‌టైమ్ ఇంతే ఉంటే.. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఎక్కువ రన్‌టైమ్ ఉన్న సినిమాగా పుష్ప-2 రికార్డుల్లో నిలవనుంది.