Allu Arjun On Saree: చీర కట్టుకోమన్నప్పుడు నా ఫస్ట్ రియాక్షన్ అదే.. పుష్ప 2 గంగమ్మ జాతర సీన్‌పై అల్లు అర్జున్ కామెంట్స్-allu arjun reveals his first reaction on wearing saree for pushpa 2 the rule gangamma jathara scene said i afraid ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun On Saree: చీర కట్టుకోమన్నప్పుడు నా ఫస్ట్ రియాక్షన్ అదే.. పుష్ప 2 గంగమ్మ జాతర సీన్‌పై అల్లు అర్జున్ కామెంట్స్

Allu Arjun On Saree: చీర కట్టుకోమన్నప్పుడు నా ఫస్ట్ రియాక్షన్ అదే.. పుష్ప 2 గంగమ్మ జాతర సీన్‌పై అల్లు అర్జున్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Allu Arjun Reaction On Wearing Saree In Pushpa 2 The Rule: అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. అయితే, పుష్ప 2 సినిమాలోని గంగమ్మ జాతర సీన్, అందులో చీర కట్టుకోవాలని డైరెక్టర్ సుకుమార్ చెప్పినప్పుడు తన రియాక్షన్ ఏంటో తాజాగా అల్లు అర్జున్ తెలిపాడు.

పుష్ప 2 ది రూల్ జాతర సీన్‌లో చీర కట్టులో అల్లు అర్జున్ స్టిల్

Allu Arjun Reaction On Wearing Saree In Pushpa 2 The Rule: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2 ది రూల్ థియేటర్లలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కూడా పుష్ప 2 ట్రెండ్ అవుతోంది.

చీర కట్టుకుని నగలు వేసుకుని

పుష్ప 2 ది రూల్ మూవీలో గంగమ్మ జాతర సీన్‌కు మంచి పేరు వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ చీర, మేకప్, ఆభరణాలు ధరించి నాట్యం చేశారు. అయితే, ఈ గంగమ్మ జాతర సీన్, ఇందులో చీర కట్టుకోవాలని డైరెక్టర్ సుకుమార్ చెప్పినప్పుడు తన రియాక్షన్ ఏంటీ, ఏమనిపించిందో తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.

నువ్ చీర కట్టుకోవాలని అన్నారు

"జాతర సన్నివేశం గురించి ఒక ముక్కలో చెప్పాలంటే.. దర్శకుడు సుకుమార్ మొదట నాతో చీర కట్టుకోవాలని చెప్పినప్పుడు నేను భయపడ్డాను. అవును, అదే నా ఫస్ట్ రియాక్షన్. మేము చాలా మాచో ఫోటోషూట్ చేశాం. కానీ, ఇది బాగాలేదు, వర్కౌట్ కావట్లేదు అని సుకుమార్ అన్నారు. ఆ తర్వాత ఆయన 'నువ్ చీర కట్టుకోవాలని అనుకుంటున్నాను. ఆడవాళ్లలా డ్రెస్ వేసుకోవాలి' అని చెప్పారు" అని అల్లు అర్జున్ తెలిపాడు.

ప్రత్యేకతను తీసుకొస్తుంది

"ఇక మేము స్కెచెస్ చేయడం స్టార్ట్ చేశాం. ఆ తర్వాత వేసుకుని చూశాం. అలా చేస్తుండగా.. ఆ ఆలోచనను నేను నమ్మడం స్టార్ట్ చేశాను. కానీ, మొదట్లో మాత్రం ఎప్పుడు భయంగా ఉండేది. ముందు భయం ఉండేది. ఆ తర్వాత దాని గురించి మరింతగా తెలుసుకున్నాను. ఒక సమయం తర్వాత మాకు అనిపించింది ఏంటంటి.. ఇది ఒక నటుడిగా సినిమాకు చాలా ప్రత్యేకతను తీసుకొస్తుంది అని. అయితే, ఒక నటుడిగా అది ఒక ఛాలెంజ్ అని నాకు తెలుసు. కానీ, ఇది నేను చేస్తే గొప్ప పేరు తెచ్చుకుంటాను అని నమ్మాను" అని అల్లు అర్జున్ వివరించాడు.

మ్యాచో లుక్ ఉండాలి

"సుకుమార్ గారు, నేను ఆలోచించిన ఒక విషయం ఏంటంటే ఒకవేళ ఆడవాళ్లలా చీర కట్టుకున్న అందులో చాలా చాలా మ్యాచో లుక్ ఉండాలి. పురుషుడు అనే ఆల్ఫానెస్ మాత్రం ఎక్కడ మిస్ కాకూడదు అని" అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

3 నిమిషాల 20 సెకన్ల పాట

కాగా పుష్ప 2 ది రూల్ సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీన్‌కు చాలా మంచి పేరు వచ్చింది. ఈ సన్నివేశంలో గంగో రేణుక తల్లి (జాతర) అనే టైటిల్‌తో పాట వస్తుంది. మూడు నిమిషాల 20 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట రష్మిక మందన్నా పాత్ర అయిన శ్రీవల్లితో ప్రారంభం అవుతుంది. పుష్ప కోసం రష్మిక చూడటంతో సాంగ్ మొదలవుతుంది. నీలం రంగు చీరలో, జుమ్కాలు, ముక్కుకు ముక్కెర, చేతులకు గాజులు, ఇతర ఆభరణాలు వేసుకుని గంగమ్మ తల్లిలా అల్లు అర్జున్ పుష్ప పాత్ర కనిపిస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం