Allu Arjun: ఆ రెండు సినిమాలను గుర్తు చేసుకున్న అల్లు అర్జున్.. ఒక మూవీకి 17ఏళ్లు.. మరొకటి నాలుగేళ్లు-allu arjun remembers desamuduru and ala vaikunthapurramuloo ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun Remembers Desamuduru And Ala Vaikunthapurramuloo

Allu Arjun: ఆ రెండు సినిమాలను గుర్తు చేసుకున్న అల్లు అర్జున్.. ఒక మూవీకి 17ఏళ్లు.. మరొకటి నాలుగేళ్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 12, 2024 07:52 PM IST

Allu Arjun: తన రెండు బ్లాక్‍బాస్టర్ చిత్రాలను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాల గురించి నేడు ట్వీట్ చేశారు. ఆ వివరాలివే..

అల్లు అర్జున్
అల్లు అర్జున్

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో చాలా బ్లాక్‍బాస్టర్లు ఉన్నాయి. అయితే, ఆయనకు సంక్రాంతి సీజన్ గతంలో బాగా కలిసి వచ్చింది. కెరీర్ ఆరంభం నుంచి మంచి హిట్‍లు సాధించారు. జనవరి 12 సెంటిమెంట్ కూడా బలంగా ఉంది. ఈ తరుణంలో తన కెరీర్లో సూపర్ హిట్‍లుగా నిలిచిన దేశముదురు, అల వైకుంఠపురములో చిత్రాలను నేడు (జనవరి 12) గుర్తు చేసుకున్నారు అల్లు అర్జున్. నేటితో దేశముదురు చిత్రానికి 17 ఏళ్లు పూర్తవగా.. అల వైకుంఠపురంలో వచ్చి నాలుగేళ్లయింది.

దేశముదురు, అల వైకుంఠపురములో సినిమాలపై నేడు ట్వీట్లు చేశారు అల్లు అర్జున్. ఎప్పటికీ గుర్తుండేవి అంటూ రాసుకొచ్చారు. అల వైకుంఠపుములో సినిమా షూటింగ్ సమయంలోని ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.

దేశముదురు

దేశ ముదురు సినిమా గురించి ముందుగా పోస్ట్ చేశారు అల్లు అర్జున్. “దేశ ముదురు చిత్రానికి 17 ఏళ్లు పూర్తయింది. అది చాలా అందమైన సమయం. నా డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత డీవీవీ దానయ్యకు, మూవీ యూనిట్ మొత్తానికి థ్యాంక్స్. అద్భుతంగా దీవించిన అభిమానులు, ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటా” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

2007 జనవరి 12వ తేదీన దేశముదురు సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ స్టార్ హీరోగా నిలబడటంతో దేశ ముదురు కీలకపాత్ర పోషించింది. ఈ మూవీతోనే సిక్స్ ప్యాక్స్ ట్రెండ్ టాలీవుడ్‍లో తీసుకొచ్చారు ఐకాన్ స్టార్. ఈ చిత్రంతో అల్లు అర్జున్‍కు మాస్ ఇమేజ్ వచ్చింది. యాక్షన్, డ్యాన్స్, మాస్ డైలాగ్స్ ఇలా ఈ చిత్రంలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెప్పించింది. దేశ ముదురు బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‍బాస్టర్ అయింది.

అల వైకుంఠపురములో..

2020 జనవరి 12న విడుదలైన అల వైకుంఠపురములో చిత్రానికి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. అల్లు అర్జున్ కెరీర్లో ఈ చిత్రం బ్లాక్‍బాస్టర్ అయింది. “అల వైకుంఠపురం చిత్రానికి 4 సంవత్సరాలు. అందరికీ ధన్యవాదాలు. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. డైరెక్టర్ త్రివిక్రమ్ సహా టీమ్‍తో కలిసి అల వైకుంఠపురంలో షూటింగ్ సమయంలో దిగిన మూడు ఫొటోలను పోస్ట్ చేశారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్, అల్లు అర్జున్ ఎనర్జిటిక్ యాక్టింగ్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు హైలైట్‍గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. థమన్ అందించిన మ్యూజిక్ కూడా ఈ మూవీకి మరో హైలైట్. మొత్తంగా ఈ సినిమా.. అల్లు అర్జున్ కెరీర్లో మైలురాయిగా నిలిచింది.

ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ సినిమా షూటింగ్‍లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. 2021లో రిలీజై పాన్ ఇండియా రేంజ్‍లో సూపర్ హిట్ అయిన పుష్ప 1కు సీక్వెల్‍గా పుష్ప 2 రూపొందుతోంది. సుకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. పుష్ప 2: ది రూల్ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది.

IPL_Entry_Point