Pushpa 2 Final Collections: పుష్ప 2 సినిమా ఫైనల్ కలెక్షన్ల లెక్క ఇదే.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..-allu arjun rashmika mandanna movie pushpa 2 the rule final box office collections revealed by makers know the records ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Final Collections: పుష్ప 2 సినిమా ఫైనల్ కలెక్షన్ల లెక్క ఇదే.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..

Pushpa 2 Final Collections: పుష్ప 2 సినిమా ఫైనల్ కలెక్షన్ల లెక్క ఇదే.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..

Pushpa 2 Final Collections: పుష్ప 2: ది రూల్ చిత్రం ఫుల్ రన్‍లో ఎంత కలెక్షన్లు సాధించిందో మేకర్స్ వెల్లడించారు. ఫైనల్ కలెక్షన్లతో ఓ పోస్టర్ రివీల్ చేశారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అని పేర్కొన్నారు.

Pushpa 2 Final Collections: పుష్ప 2 సినిమా ఫైనల్ కలెక్షన్ల లెక్క ఇదే.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు పూర్తయింది. ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం స్ట్రీమింగ్‍లోనూ సత్తాచాటుతోంది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్‍ను షేక్ చేసేసింది. క్రేజ్‍కు తగ్గట్టే ఆరంభం నుంచి కలెక్షన్ల సునామీ సృష్టించింది సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ మూవీ. థియేట్రికల్ రన్ ఎండ్ అవడంతో పుష్ప 2 క్లోజింగ్ ఫైనల్ కలెక్షన్లను మూవీ టీమ్ వెల్లడించింది.

ఫైనల్ కలెక్షన్లు ఇలా..

పుష్ప 2: ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (ఫిబ్రవరి 18) ప్రకటించింది. “చాలా రికార్డులు బద్దలుకొట్టి.. కొన్ని కొత్త రికార్డులను సృష్టించి.. భారతీయ సినిమా ఇండస్ట్రీ హిట్‍గా పుష్ప 2 ది రూల్ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1871 కోట్ల గ్రాస్ సాధించింది. రికార్స్డ్ రప్పారప్పా” అని మూవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

రూ.1871 కోట్ల లెక్కతో ఓ పోస్టర్ కూడా రివీల్ చేసింది పుష్ప 2 టీమ్. అల్లు అర్జున్‍తో పాటు సుకుమార్ ఫొటోను కూడా పోస్టర్‌లో పొందుపరిచింది. ఈ మూవీ సక్సెస్ క్రెడిట్ సుకుమార్‌దే అంటూ సక్సెస్ మీట్‍లో అల్లు అర్జున్ చెప్పారు. అల్లు అర్జున్ వల్లే ఈ మూవీ సాధ్యమైందంటూ సుకుమార్ అన్నారు. ఇలా ఇద్దరి మధ్య ఉన్న బలమైన బంధాన్ని వ్యక్తం చేసుకున్నారు.

రికార్డులు ఇవే..

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న భారతీయ చిత్రాల్లో పుష్ప 2 రెండో స్థానంలో నిలిచింది. రూ.2,2024 కోట్లతో దంగల్ తొలి స్థానంలో ఉంటే.. రూ.1,871 కోట్లతో పుష్ప 2 రెండో ప్లేస్‍కు వచ్చింది. బాహుబలి 2 (రూ.1,810కోట్లు)ని కూడా దాటేసింది. దంగల్ చిత్రం చైనాలోనే ఎక్కువ శాతం వసూళ్లు దక్కించుకుంది. కాగా, ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రికార్డును పుష్ప 2 తన ఖాతాలో వేసుకుంది. టాప్‍లో నిలిచింది.

హిందీ నెట్‍ కలెక్షన్ల విషయంలో రూ.700 కోట్లు, రూ.800కోట్ల మార్క్ తొలిసారి దాటిన మూవీగా రికార్డును పుష్ప 2 ఖాతాలో వేసుకుంది. ఏ బాలీవుడ్ మూవీకి కూడా ఇప్పటి వరకు రూ.700 కోట్ల హిందీ నెట్ కలెక్షన్లు దక్కలేదు. అత్యంత వేగంగా రూ.1,000 కోట్లు, రూ.1500కోట్ల గ్రాస్ సాధించిన రికార్డు కూడా ఈ చిత్రానిదే.

పుష్ప 2 చిత్రాన్ని గ్రాండ్ స్కేల్‍లో యాక్షన్ మూవీగా సుకుమార్ తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్ తర్వాత అంచనాలు అత్యంత భారీగా ఉండగా వాటిని అందుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనలో విశ్వరూపాన్ని చూపారు. ప్రశంసలు దక్కించుకున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. ఫాహద్ ఫాజిల్ నెగెటివ్ రోల్ పోషించారు. జగపతి బాబు, రావు రమేశ్, సునీల్, జగదీశ్, అనసూయ, అజయ్, తారక్ పొన్నప్ప కీరోల్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సామ్ సీఎస్.. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍లో ఎక్కువ శాతం ఇచ్చారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం