Pushpa Release in Russia: ర‌ష్యాలో రిలీజ్ కానున్న అల్లు అర్జున్ పుష్ప‌-allu arjun pushpa to release in russia in december first week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun Pushpa To Release In Russia In December First Week

Pushpa Release in Russia: ర‌ష్యాలో రిలీజ్ కానున్న అల్లు అర్జున్ పుష్ప‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 26, 2022 10:59 AM IST

Pushpa Release in Russia: అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప సినిమా ర‌ష్యాలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం అల్లు అర్జున్ త్వ‌ర‌లోనే ర‌ష్యా వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

Pushpa Release in Russia: ప్ర‌స్తుతం భాషాభేదాల‌తో సంబంధం లేకుండా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా తెలుగు సినిమాలు ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను సొంతం చేసుకుంటున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అద్భుత‌మైన వ‌సూళ్ల‌తో ఆర్ఆర్ఆర్ సంచ‌ల‌న సృష్టిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప సినిమా ర‌ష్యాలో రిలీజ్ కాబోతున్న‌ది.

డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో ర‌ష్యాలో ఈ సినిమాను విడుద‌ల‌కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం అల్లు అర్జున్ ర‌ష్యా వెళ్ల‌నున్న‌ట్లు తెలిసింది. స్పెష‌ల్ ప్రీమియ‌ర్స్‌కు అత‌డు హాజ‌రుకాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ ప్రీమియ‌ర్ డేట్స్ రివీల్ కానున్నాయి. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో పుష్ప సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

వ‌ర‌ల్డ్ వైడ్‌గా దాదాపు నాలుగు వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ సినిమా క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత ఫ‌స్ట్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. పుష్ప‌రాజ్‌గా బ‌న్నీ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు సుకుమార్ డిజైన్ చేసిన విధానంతో పాటు అత‌డి మేన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

ప్ర‌స్తుతం ఈ సినిమాకు పుష్ప ది రూల్ పేరుతో సీక్వెల్‌నుతెర‌కెక్కుతోంది. త్వ‌ర‌లోనే ఈ సీక్వెల్ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. పుష్ప పార్ట్ 1 సంచ‌ల‌న విజ‌యం సాధించడంతో సీక్వెల్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో పుష్ప -2 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

IPL_Entry_Point