Pushpa 2 Trailer: పుష్ప-2 ట్రైలర్ రిలీజ్‌కి డేట్, టైమ్ ఫిక్స్.. ఫస్ట్ బ్లాస్టింగ్‌కి ఆ సిటీ ఆతిథ్యం-allu arjun pushpa 2 trailer release date and time out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Trailer: పుష్ప-2 ట్రైలర్ రిలీజ్‌కి డేట్, టైమ్ ఫిక్స్.. ఫస్ట్ బ్లాస్టింగ్‌కి ఆ సిటీ ఆతిథ్యం

Pushpa 2 Trailer: పుష్ప-2 ట్రైలర్ రిలీజ్‌కి డేట్, టైమ్ ఫిక్స్.. ఫస్ట్ బ్లాస్టింగ్‌కి ఆ సిటీ ఆతిథ్యం

Galeti Rajendra HT Telugu
Nov 11, 2024 05:39 PM IST

Pushpa 2 Trailer release date: పుష్ప టీమ్ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. సినిమా రిలీజ్‌కి రెండు వారాల ముందు ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏడు నగరాల్లో ఈవెంట్స్‌ను ప్లాన్ చేస్తుండగా.. ఫస్ట్ ఈవెంట్‌లోనే ట్రైలర్ రిలీజ్ చేయనుంది.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 నుంచి ఎట్టకేలకు ట్రైలర్‌‌పై అప్‌డేట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబరు 5న రిలీజ్ కాబోతుండగా.. ప్రమోషన్ ఈవెంట్స్ కోసం చిత్ర యూనిట్‌ గట్టిగా ప్లాన్ చేస్తోంది. దేశంలోని 7 ప్రముఖ నగరాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్స్‌ను నిర్వహించబోతోంది.

స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రీలీల సాంగ్

సుకుమార్ దర్శకత్వంలో 2021లో రిలీజైన పుష్ప: ది రైజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పగా.. పుష్ప: ది రూల్‌పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. పుష్ప-1లో సమంత ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌, రావు రమేశ్‌, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు తదితరులు పుష్ప-2లో నటించారు.

పుష్ప-2 ట్రైలర్‌ను నవంబరు 17న సాయంత్రం 6.03 గంటలకి రిలీజ్ చేయబోతున్నట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా సోమవారం ప్రకటించింది. ఆరోజు పట్నాలో పెద్ద ఎత్తున ఈవెంట్‌ను ప్లాన్ చేసిన పుష్ప-2 టీమ్.. అదే ఈవెంట్‌లో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయబోతోంది.

ఏడు నగరాల్లో ఈవెంట్స్

ఓవరాల్‌గా మూవీ రిలీజ్‌కి దేశంలోని ఏడు నగరాల్ని పుష్ప టీమ్ ఎంపిక చేసింది. ఇందులో పట్నాతో పాటు కోల్‌కతా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ ఉన్నాయి. డిసెంబరు 5 నాటికి ఈ ఏడు సిటీల్లోనూ ఈవెంట్స్ జరగనున్నాయి. రిలీజ్‌కి ముందే పుష్ప-2 రికార్డుల మోత మోగించేస్తోంది. యునైటెడ్ స్టేట్స్‌లో అత్యంత వేగంగా 15 వేల టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాగా పుష్ప-2 నిలిచింది.

భారీ స్థాయిలో మూవీ రిలీజ్‌కి ప్లాన్

డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 సినిమా ఆరు భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. మొత్తం 11,500 స్క్రీన్స్‌లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఓవర్సీస్‌లో సుమారు 5000 వేల వరకు స్క్రీన్స్ ఉండగా.. మిగిలినవి అన్నీ ఇండియాలోనే.

Whats_app_banner