Pushpa 2 Teaser: మాస్ జాతర అంటూ పుష్ప 2 టీజర్‌పై అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్: వివరాలివే-allu arjun pushpa 2 the rule teaser announcement coming tomorrow mass jaathara ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Teaser: మాస్ జాతర అంటూ పుష్ప 2 టీజర్‌పై అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్: వివరాలివే

Pushpa 2 Teaser: మాస్ జాతర అంటూ పుష్ప 2 టీజర్‌పై అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 01, 2024 08:20 PM IST

Pushpa 2 The Rule Teaser Update: పుష్ప 2 సినిమా టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హీరో అల్లు అర్జున్ పుట్టిన రోజున ఈ టీజర్ వస్తుందని తెలుస్తోంది. అయితే, ఈ టీజర్ గురించి ఓ అప్‍డేట్ ఇచ్చింది మూవీ టీమ్.

Pushpa 2 Teaser: మాస్ జాతర అంటూ పుష్ప 2 టీజర్‌పై అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్: వివరాలివే
Pushpa 2 Teaser: మాస్ జాతర అంటూ పుష్ప 2 టీజర్‌పై అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్: వివరాలివే (twitter)

Pushpa 2 Teaser Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ మూవీ కోసం సినీ ప్రేక్షకులందరూ వేచిచూస్తున్నారు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్పకు సీక్వెల్‍గా వస్తున్న ఈ చిత్రంపై హైప్ పీక్స్‌లో ఉంది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 భారీ స్థాయిలో రూపొందుతోంది. కాగా, ఈ మూవీ టీజర్ త్వరలో వచ్చేస్తోందంటూ ఇటీవల బజ్ నడుస్తోంది. ఈ తరుణంలో మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 1) ఓ అప్‍డేట్ ఇచ్చింది.

మాస్ జాతర

పుష్ప మాస్ జాతర రేపు (ఏప్రిల్ 2) మొదలవుతుందని పుష్ప 2 టీమ్ నేడు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఉత్సాకరమైన అనౌన్స్‌మెంట్ వచ్చేస్తోందని వెల్లడించింది. పుష్ప 2 టీజర్ రిలీడ్ డేట్ ప్రకటన గురించే ఇది అని అర్థమవుతోంది.

“పుష్ప మాస్ జాతర రేపు మొదలుకానుంది. ఎగ్జైటింగ్ అనౌన్స్‌మెంట్ రేపు (ఏప్రిల్ 2) రానుంది” అని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఆగస్టు 15వ తేదీనే ఈ చిత్రం విడుదల కానుందని మరోసారి కన్ఫార్మ్ చేసింది.

టీజర్ అప్పుడే!

అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8వ తేదీన పుష్ప 2 సినిమా టీజర్ రానుందని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఈ దిశగా మూవీ టీమ్ ఇటీవలే సంకేతాలు ఇచ్చింది. టీజర్ ఫైనల్ కట్ కూడా రెడీ అయిందని తెలుస్తోంది. ఈ టీజర్ రిలీజ్‍ డేట్‍ను రేపు (ఏప్రిల్ 2) మూవీ టీమ్ వెల్లడించనుంది.

పుష్ప 2 సినిమా కోసం టాలీవుడ్‍తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా విపరీతంగా ఎదురుచూస్తున్నారు. 2021లో వచ్చిన పుష్ప మూవీ దేశవ్యాప్తంగా రిలీజైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ అయింది. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ చిత్రంలో బన్నీ మేరిజమ్స్, యాక్షన్, యాక్టింగ్, స్టైల్‍కు అందరూ ఫిదా అయ్యారు. దీంతో పుష్ప 2 చిత్రంపై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి.

పుష్ప 2 సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఇటీవలే విశాఖపట్నంలో షెడ్యూల్ జరిగింది. మరికాస్త చిత్రీకరణ పెండింగ్‍లో ఉంది. త్వరలోనే మరో షెడ్యూల్ జరగనుంది. ఈ చిత్రాన్ని భారీ స్కేల్‍లో గ్రాండ్‍గా రూపొందిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్.

పుష్ప 2 చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ కీరోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ గ్లోబల్ రేంజ్‍కు చేరింది. ఇటీవలే దుబాయ్‍లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అతడి మైనపు విగ్రహం ఏర్పాటైంది. దీన్ని స్వయంగా అల్లు అర్జునే స్వయంగా ఆవిష్కరించారు. ఇందుకోసం కుటుంబంతో కలిసి ఆయన దుబాయ్ వెళ్లారు. పుష్ప స్టైల్‍లో ఏర్పాటైన తన మైనపు విగ్రహం పక్కనే అదే పోజుతో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.