Pushpa 2 Record: పుష్ప 2 సినిమా రికార్డుల హోరు కంటిన్యూ.. మరొకటి-allu arjun pushpa 2 the rule creates single screen theatre collections record in telugu states ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Record: పుష్ప 2 సినిమా రికార్డుల హోరు కంటిన్యూ.. మరొకటి

Pushpa 2 Record: పుష్ప 2 సినిమా రికార్డుల హోరు కంటిన్యూ.. మరొకటి

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 25, 2025 04:43 PM IST

Pushpa 2 The Rule Record: పుష్ప 2 సినిమా రికార్డుల వేటను ఇంకా కొనసాగిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం తాజాగా మరో రికార్డు సృష్టించింది. ఆ వివరాలు ఇవే..

Pushpa 2 Record: పుష్ప 2 సినిమా రికార్డుల హోరు కంటిన్యూ.. మరొకటి
Pushpa 2 Record: పుష్ప 2 సినిమా రికార్డుల హోరు కంటిన్యూ.. మరొకటి

పుష్ప 2: ది రూల్ సినిమా చాలా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సీక్వెల్ మూవీ అంచనాలను అందుకొని దుమ్మురేపేసింది. డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.1,830 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. ఇటీవలే జనవరి 17న అదనపు సీన్లతో పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ రాగా.. మళ్లీ కలెక్షన్లు పుంజుకున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా తాజాగా మరో రికార్డు సృష్టించింది. అదేంటంటే..

yearly horoscope entry point

సింగిల్ స్క్రీన్ కలెక్షన్ల రికార్డు

తెలుగు రాష్ట్రాల్లో ఓ సింగిల్ స్క్రీన్‍ థియేటర్‌లో అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న చిత్రంగా పుష్ప 2 చిత్రం రికార్డు దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జనవరి 25) వెల్లడించింది. హైదరాబాద్‍లోని సంధ్య 70ఎంఎం థియేటర్లో 51 రోజుల్లో పుష్ప 2 చిత్రానికి 206 షోలు పడ్డాయని, రూ.1,89,75,880 గ్రాస్ కలెక్షన్లు దక్కాయని మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది.

సంధ్య థియేటర్లో పుష్ప 2 మూవీని 1.04లక్షల మంది ప్రేక్షకులు చూశారని, రూ.1.89కోట్ల గ్రాస్ దక్కిందని టీమ్ వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా రికార్డు దక్కిందని పేర్కొంది.

పుష్ప 2 ప్రీమియర్ల సందర్భంగా సంధ్య థియేటర్లలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు బాలుడు గాయపడి చికిత్స పొందారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఓ రోజు జైలులో ఉన్నారు. మధ్యంతర బెయిల్‍పై బయటికి వచ్చారు. ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇటీవల వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని కూడా అల్లు అర్జున్ పరామర్శించారు.

పుష్ప 2 రికార్డులు

పుష్ప 2 సినిమా ఇప్పటికే చాలా రికార్డులు సృష్టించింది. హిందీలో రూ.800కోట్ల నెట్ కలెక్షన్లను దక్కించుకుంది. బాలీవుడ్‍లో ఆల్‍టైమ్ రికార్డును సృష్టించింది. ఏ బాలీవుడ్ హీరోకు ఇప్పటి వరకు సాధ్యం కాని రూ.700కోట్లు, రూ.800కోట్ల హిందీ నెట్ వసూళ్ల మార్కును అల్లు అర్జున్ సాధించారు. ఈ సినిమా ఇప్పటికే రూ.1,830 కోట్ల గ్రాస్ మార్క్ దాటింది. దీంతో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలను దాటేసి.. ఇండియాలో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న చిత్రంగా నిలిచింది. దంగల్ తర్వాత అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా పుష్ప 2 నిలిచింది. మరిన్ని రికార్డులను కూడా సృష్టించింది.

పుష్ప 2 సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. మూడేళ్ల కిందట వచ్చి సెన్సేషన్ హిట్ అయిన తొలి భాగంతో అంచనాలు భారీగా నెలకొనగా.. ఈ సీక్వెల్‍ను కూడా ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రం దుమ్మురేపేసింది. పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, జగదీశ్ కీరోల్స్ చేశారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.

Whats_app_banner

సంబంధిత కథనం