Pushpa 2: పుష్ప‌రాజ్‌తో శ్రీవ‌ల్లి రొమాంటిక్ డ్యూయెట్ - పుష్ప -2 సెకండ్ సింగిల్‌పై ర‌ష్మిక ట్వీట్ వైర‌ల్‌-allu arjun pushpa 2 second single update rashmika mandanna tweet viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2: పుష్ప‌రాజ్‌తో శ్రీవ‌ల్లి రొమాంటిక్ డ్యూయెట్ - పుష్ప -2 సెకండ్ సింగిల్‌పై ర‌ష్మిక ట్వీట్ వైర‌ల్‌

Pushpa 2: పుష్ప‌రాజ్‌తో శ్రీవ‌ల్లి రొమాంటిక్ డ్యూయెట్ - పుష్ప -2 సెకండ్ సింగిల్‌పై ర‌ష్మిక ట్వీట్ వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
May 22, 2024 01:11 PM IST

Pushpa 2: పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ రాబోతోంది. ఈ పాట‌తో అల్లు అర్జున్‌, పుష్ప‌రాజ్ జంట‌గా అభిమానుల‌కు క‌నువిందు చేయ‌బోతున్నారు.

పుష్ప 2  సెకండ్ సింగిల్
పుష్ప 2 సెకండ్ సింగిల్

Pushpa 2: పుష్ప 2 మూవీ నుంచి సెకండ్ సింగిల్‌పై మేక‌ర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశారు. సెకండ్ సింగిల్ సంబంధించిన రిలీజ్ డేట్‌ను మే 23న (గురువారం) అనౌన్స్‌చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సెకండ్ సింగిల్‌లో అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిసి క‌నిపించ‌బోతున్న‌ట్లు హింట్ ఇచ్చారు.

శ్రీవ‌ల్లితో త‌న సామీతో క‌లిసి క‌పుల్ సాంగ్ ద్వారా అభిమానుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌డం ఖాయ‌మ‌ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించింది. సెకండ్ సింగిల్ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించి సూప‌ర్ అని అర్థం వ‌చ్చేలా ర‌ష్మిక చేతి వేళ్ల‌ను మాత్ర‌మే చూపిస్తూ ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే మాస్ రొమాంటిక్ డ్యూయెట్‌గా ఈ సాంగ్ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ర‌ష్మిక ట్వీట్‌...

ఈ సెకండ్ సింగిల్‌పై ర‌ష్మిక కూడా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. సాంగ్ షూట్ మొత్తం అద్భుతంగా సాగింద‌ని, ఈ సెకండ్ సింగిల్‌ త‌ప్ప‌కుండా అంద‌రిని అల‌రిస్తుంద‌ని ర‌ష్మిక అన్న‌ది. సో ఎగ్జైటెడ్ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

35 మిలియ‌న్ల వ్యూస్‌

ఇటీవ‌లే పుష్ప 2లో పుష్ప పుష్ప అనే పాట‌ను రిలీజ్ చేశారు. మే 1న రిలీజైన ఈ పాట‌కు ఇప్ప‌టివ‌ర‌కు 35 మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్ వ‌చ్చాయి. ఫ‌స్ట్ సింగిల్ స‌క్సెస్ నేప‌థ్యంలో సెకండ్ సింగిల్‌పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఆగ‌స్ట్ 15న రిలీజ్‌

పుష్ప 2 మూవీ ఆగ‌స్ట్ 15న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ కాబోతోంది. ఫ‌స్ట్ పార్ట్‌కు మించి హీరోయిన్‌, మాస్ ఎలివేష‌న్స్‌తో డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ మూవీని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. పుష్ప‌రాజ్ సిండికేట్ లీడ‌ర్‌గా ఎంపిక‌వ్వ‌డంతో పుష్ప పార్ట్ వ‌న్ ముగిసింది.

అక్క‌డి నుంచే సీక్వెల్ మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. పుష్ఫ‌రాజ్‌తో భ‌న్వ‌ర్‌సింగ్ షెకావ‌త్ గొడ‌వ‌లు, విల‌న్స్ అంద‌రూ ఏక‌మై పుష్ప‌ను దెబ్బ‌కొట్ట‌డానికి వేసే ఎత్తుల‌తో ఈ సీక్వెల్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. పుష్పలో అస‌మాన న‌ట‌న‌కు గాను అల్లు అర్జున్ నేష‌న‌ల్ అవార్డ్ అందుకోవ‌డంతో సీక్వెల్‌పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

500 కోట్ల బ‌డ్జెట్‌...

పుష్ప స‌క్సెన్ కావ‌డంతో ఈ సీక్వెల్‌ను దాదాపు 500 కోట్ల‌ బ‌డ్జెట్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో అత్య‌ధిక బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న సినిమాల్లో ఒక‌టిగా పుష్ప 2 నిలిచింది.

పుష్ప 2 మూవీలో మ‌ల‌యాళ అగ్ర న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తోండ‌గా... సునీల్‌, అన‌సూయ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు కూడా ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఓటీటీ డీల్ క్లోజ్‌

రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ప్లిక్స్ రికార్డు ధ‌ర‌కు సొంతం చేసుకున్న‌ది. 275 కోట్ల‌కు పుష్ప 2 ఓటీటీ హ‌క్కులు అమ్ముడుపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ది. పుష్ప 2 త‌ర్వాత త్రివిక్ర‌మ్‌, సందీప్ వంగాల‌తో సినిమాలు చేయ‌బోతున్నాడు అల్లు అర్జున్‌.

Whats_app_banner