Pushpa 2 OTT Streaming: ఓటీటీ స్ట్రీమింగ్‍కు పుష్ప 2 సినిమా.. వారికి నిరాశ ఎదురుకానుందా!-allu arjun pushpa 2 ott release confirmed on netflix but hindi streaming may delay ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Ott Streaming: ఓటీటీ స్ట్రీమింగ్‍కు పుష్ప 2 సినిమా.. వారికి నిరాశ ఎదురుకానుందా!

Pushpa 2 OTT Streaming: ఓటీటీ స్ట్రీమింగ్‍కు పుష్ప 2 సినిమా.. వారికి నిరాశ ఎదురుకానుందా!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 28, 2025 08:17 AM IST

Pushpa 2 OTT Streaming: పుష్ప 2 సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. బాక్సాఫీస్‍ను షేక్ చేసిన ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. అయితే, ఓటీటీ రిలీజ్‍‍లో కాస్త ట్విస్ట్ ఉండనున్నట్టు తెలుస్తోంది.

Pushpa 2 OTT: ఓటీటీలోకి పుష్ప 2 సినిమా.. వారికి నిరాశ ఎదురుకానుందా!
Pushpa 2 OTT: ఓటీటీలోకి పుష్ప 2 సినిమా.. వారికి నిరాశ ఎదురుకానుందా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా అనేక బాక్సాఫీస్ రికార్డును బద్దలుకొట్టింది. భారీ కలెక్షన్లతో దుమ్మురేపేసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తన స్వాగ్, స్టైల్, యాక్షన్‍తో అల్లు అర్జున్ మరోసారి అదరగొట్టారు. దీంతో డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన పుష్ప 2కు ఆరంభం నుంచే భారీ కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పుడు ఓటీటీలోకి పుష్ప 2 మూవీ ఈవారమే వచ్చేస్తోంది.

yearly horoscope entry point

హిందీ ప్రేక్షకులకు నిరాశే!

పుష్ప 2 సినిమా మరో రెండు రోజుల్లో జనవరి 30వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికి ఈ నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‍కు వస్తుందని నెట్‍ఫ్లిక్స్ కూడా పోస్ట్ చేసింది. దీంతో హిందీ ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. పుష్ప 2 హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ ఆలస్యం కానుందని అర్థమైపోయింది.

తెలుగు సినిమా అయిన పుష్ప 2 చిత్రం హిందీలోనే భారీ బ్లాక్‍బస్టర్ కొట్టింది. హిందీ డబ్బింగ్‍గా వెళ్లి బాలీవుడ్‍లో ఆల్‍టైమ్ రికార్డును సృష్టించింది. హిందీలో రూ.800కోట్ల నెట్‍ కలెక్షన్ల మార్క్ దక్కించుకున్న తొలి మూవీగా నిలిచింది. ఏ బాలీవుడ్ చిత్రానికి ఇప్పటి వరకు సాధ్యం కాని రికార్డులను నెలకొల్పింది. అంతలా ఉత్తరాదిలో హిందీ ప్రేక్షకులు పుష్ప 2 మూవీని చూశారు. అయితే, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో పుష్ప 2 హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ ఆలస్యం కానుండడం మాత్రం వారికి పెద్ద నిరాశే. మరి హిందీ వెర్షన్‍ను నెట్‍ఫ్లిక్స్ ఎప్పుడు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసిందో చూడాలి. ఫిబ్రవరిలో రావొచ్చు.

రీలోడెడ్ వెర్షన్

ఓటీటీలోకి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ రానుంది. అదనంగా 23 నిమిషాల రన్‍టైమ్‍తో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ రీలోడెడ్ వెర్షన్ జనవరి 17వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. అదే వెర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. మొత్తంగా పుష్ప 2 రన్‍టైమ్ 3 గంటల 44 నిమిషాలుగా ఉండనుంది. జనవరి 30న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీని చూడొచ్చు. హిందీ వెర్షన్ కోసం ఇంకొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1850కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇండియాలో అత్యధిక వసూళ్లను దక్కించుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ల విషయంలో దంగల్ తర్వాత రెండో భారతీయ మూవీగా నిలిచింది. హిందీ వసూళ్ల విషయంలోనూ చరిత్ర సృష్టించింది. అత్యంత వేగంగా రూ.1000కోట్ల మార్క్ సహా ఇలా చాలా రికార్డులను ఖాతాలో వేసుకుంది.

పుష్ప 2 చిత్రాన్ని భారీ స్కేల్‍లో తన మార్క్ యాక్షన్ మూవీగా తెరకెక్కించి అంచనాలను నిలబెట్టుకున్నారు సుకుమార్. పుష్పకు పర్‌ఫెక్ట్ సీక్వెల్‍లా తీసుకొచ్చి మెప్పించారు. పుష్ప 2 చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీలో అల్లు అర్జున్‍‍కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, ఆజయ్, జగదీశ్ కీరోల్స్ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం