Pushpa 2 Dialogues: పుష్ప 2లో అల్లు అర్జున్ పవర్‌ఫుల్ డైలాగ్స్.. ఏదేదో ఊహించేసుకుంటున్న ఫ్యాన్స్-allu arjun pushpa 2 dialogues now going viral fans they aim at mega family ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Dialogues: పుష్ప 2లో అల్లు అర్జున్ పవర్‌ఫుల్ డైలాగ్స్.. ఏదేదో ఊహించేసుకుంటున్న ఫ్యాన్స్

Pushpa 2 Dialogues: పుష్ప 2లో అల్లు అర్జున్ పవర్‌ఫుల్ డైలాగ్స్.. ఏదేదో ఊహించేసుకుంటున్న ఫ్యాన్స్

Hari Prasad S HT Telugu
Dec 05, 2024 10:58 AM IST

Pushpa 2 Dialogues: పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ చెప్పిన కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీతో వివాదం నేపథ్యంలో ఈ డైలాగ్స్ విని అల్లు ఫ్యాన్స్ ఏదేదో ఊహించేసుకుంటున్నారు.

పుష్ప 2లో అల్లు అర్జున్ పవర్‌ఫుల్ డైలాగ్స్.. ఏదేదో ఊహించేసుకుంటున్న ఫ్యాన్స్
పుష్ప 2లో అల్లు అర్జున్ పవర్‌ఫుల్ డైలాగ్స్.. ఏదేదో ఊహించేసుకుంటున్న ఫ్యాన్స్

Pushpa 2 Dialogues: అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ పుష్ప 2 మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమంటూ బన్నీ ఫ్యాన్స్ చెప్పుకుంటున్న ఈ సినిమాలో ఇప్పుడు కొన్ని డైలాగ్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమాలో సందర్భాన్ని వచ్చే డైలాగ్స్ ను అతని ఫ్యాన్స్ మాత్రం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినవిగా చెప్పుకుంటుండటం గమనార్హం.

yearly horoscope entry point

పుష్ప 2 డైలాగ్స్

పుష్ప 2 మూవీ ఊహించినట్లే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తూ థియేటర్లలో అడుగుపెట్టింది. బుధవారం (డిసెంబర్ 4) రాత్రి నుంచే అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవిదేశాల్లోనూ వాళ్లు సందడి చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ కావడంతో ఈ మూవీలోని ప్రతి చిన్న విషయాన్నీ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే మూవీలోని కొన్ని డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్.. వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం నుంచి మెగా ఫ్యామిలీతో దూరం పెరిగిన నేపథ్యంలో ఆ డైలాగులన్నీ వాళ్లను ఉద్దేశించి ఉన్నవే అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు లేని డైలాగులను కూడా మరికొందరు తెరపైకి తీసుకొస్తున్నారు.

సినిమా మొదట్లోనే మీ బాస్ కే నేను బాస్ అంటూ పుష్ప ఓ డైలాగ్ చెబుతాడు. దీనికి సోషల్ మీడియాలో ఇంకాస్త జోడించి.. "ఎవడ్రా బాస్.. ఎవడికిరా బాస్.. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్" అని అన్నట్లుగా క్రియేట్ చేస్తున్నారు. నిజానికి చాలా వరకు డైలాగ్స్ మూవీలో సందర్భానుసారంగానే వచ్చినా.. బయట ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని మలచుకుంటున్నారు.

ఈ డైలాగ్స్ కూడా అలాగే..

పైన చెప్పిన డైలాగ్ ఒక్కటే కాదు.. మరికొన్ని డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి. మనం టాప్ లో ఉన్నప్పుడు ఈగోలకు పోకూడదు అనే డైలాగ్ కూడా అందులో ఒకటి. పెళ్లాం మాట వింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తా అని మరో సందర్భంలో అంటాడు. అలాగే నా స్నేహితుడి కోసం వస్తా అనే డైలాగ్ కూడా.

ఈ రెండూ గతంలో ఏపీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం ఎందుకు చేయాల్సి వచ్చిందో అల్లు అర్జున్ వివరణ ఇస్తున్న సమయంలో చేసినవే. దీంతో మరోసారి బన్నీ వాటిని గుర్తు చేస్తూ ఇచ్చిన కౌంటర్ అని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఒకడు ఎదుగుతుంటే చాలా మందికి నచ్చదు.. వాడి డౌన్ ను చూడాలని కోరుకుంటారన్న డైలాగ్ కూడా అలాంటిదే. పరోక్షంగా తన డౌన్‌ఫాల్ ను ఓ వర్గం కోరుకుంటోందని అతడు చెప్పకనే చెప్పినట్లు ఆపాదిస్తున్నారు. మొత్తానికి పుష్ప 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు, పాజిటివ్ రివ్యూల సంగతేంటోగానీ.. మూవీలోని డైలాగ్స్ మాత్రం అనుకోకుండా ఇలా రచ్చ చేస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే.. నటన పరంగా అల్లు అర్జున్ కు ఈ మూవీ మరో మైలురాయిగా నిలుస్తుందని మాత్రం మరికొందరు స్పష్టం చేస్తున్నారు.

Whats_app_banner