Allu Arjun Liquor: గోవాలో అల్లు అర్జున్ ఆ మందు బాటిల్ ఎవరి కోసం కొన్నాడో తెలుసా?-allu arjun purchase liquor bottle in goa unstoppable with nbk show reveals the reason ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Liquor: గోవాలో అల్లు అర్జున్ ఆ మందు బాటిల్ ఎవరి కోసం కొన్నాడో తెలుసా?

Allu Arjun Liquor: గోవాలో అల్లు అర్జున్ ఆ మందు బాటిల్ ఎవరి కోసం కొన్నాడో తెలుసా?

Hari Prasad S HT Telugu
Nov 14, 2024 03:21 PM IST

Allu Arjun Liquor: అల్లు అర్జున్ గోవాలో ఓ వైన్ షాప్ కు వెళ్లిన వీడియో అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలుసు కదా. ఇప్పుడా వీడియో గురించి, అక్కడ తాను కొన్న మందు బాటిల్ గురించి అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోలో బన్నీ చెప్పబోతున్నాడు.

గోవాలో అల్లు అర్జున్ ఆ మందు బాటిల్ ఎవరి కోసం కొన్నాడో తెలుసా?
గోవాలో అల్లు అర్జున్ ఆ మందు బాటిల్ ఎవరి కోసం కొన్నాడో తెలుసా?

Allu Arjun Liquor: అల్లు అర్జున్ తో బాలకృష్ణ చెప్పే ముచ్చట్లకు టైమ్ దగ్గర పడుతోంది. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4లో భాగంగా ఈ వారం అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. ఈ షోలో ఇద్దరూ ఎన్నో సరదా విషయాలపై మాట్లాడుకోగా.. అందులో గోవాలో బన్నీ వైన్ షాప్‌కు వెళ్లిన వీడియోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ సీక్రెట్ కూడా ఉంది.

గోవా వైన్ షాప్‌లో అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ మధ్య గోవాలో ఓ వైన్ షాపులో మందు కొంటున్న వీడియో వైరల్ అయిన విషయం తెలుసు కదా. అది అతడేనా అన్న సందేహాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోలో భాగంగా నాలుగో ఎపిసోడ్ కు వచ్చిన బన్నీ.. ఆ వీడియో గురించి మాట్లాడాడు. అందులో ఉన్నది తానే అని కూడా కన్ఫమ్ చేశాడు.

ఆ వైన్ షాప్ వీడియో గురించి బాలయ్య ప్రత్యేకంగా ప్రస్తావించగా.. బన్నీ నవ్వుతూ తాను నిజంగానే వెళ్లినట్లు చెప్పాడు. అయితే అక్కడ మందు బాటిల్ తన కోసం కొనలేదని, ఓ స్పెషల్ పర్సన్ కోసం కొన్నట్లు తెలిపాడు. ఆ స్పెషల్ పర్సన్ ఎవరు అన్నది ఈ షోలోనే బన్నీ రివీల్ చేయబోతున్నాడు. పుష్ప 2 స్టార్ తో బాలకృష్ణ చేసిన ఫన్నీ టాక్ షో శుక్రవారం (నవంబర్ 15) రాత్రి 8.30 గంటలకు ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

అల్లు అర్జున్ ఎపిసోడ్ ప్రోమో

అల్లు అర్జున్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఆహా వీడియో రిలీజ్ చేసింది. ఇందులో చాలా విషయాలపై వీళ్లు మాట్లాడుకున్నారు. నాలుగు నిమిషాలకుపైగా ఉన్న ఈ ప్రోమో మొదట సరదాగా మొదలైంది. ఆ తర్వాత కాస్త సీరియస్ అంశాలపైనా బన్నీ మాట్లాడాడు.

చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబులాంటి స్టార్ల ఫొటోలను చూపించి వాళ్లపై బన్నీ అభిప్రాయాలను కూడా బాలయ్య బాబు అడిగాడు. వీళ్లలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ల గురించి అల్లు వారబ్బాయి ఏం మాట్లాడాడన్నది ఆసక్తికరం. ఎందుకంటే ఏపీ ఎన్నికల సమయం నుంచి అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి మధ్య విభేదాల నేపథ్యంలో ఈ టాక్ షోపై అందరి కళ్లూ ఉన్నాయి. ఇక ఈ ఎపిసోడ్ కు అల్లు అర్జున్ తల్లి కూడా రావడం విశేషం.

చిన్నప్పుడు ఆమె తనను బాగానే కొట్టేదని ఈ సందర్భంగా బన్నీ చెప్పాడు. అయితే ఆ వెపన్స్ అన్నింటి కంటే తాను స్నేహా రెడ్డి అనే వెపన్ వల్ల మారిపోయినట్లు కూడా ఈ సందర్భంగా అతడు చెప్పాడు. అల్లు అర్జున్, బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ను ఆహా వీడియో ఓటీటీలో శుక్రవారం (నవంబర్ 15) రాత్రి 8.30 గంటల నుంచి చూడొచ్చు.

Whats_app_banner