టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ తెరపైకి రాబోతోంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్.. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడీ కన్నడ స్టార్ డైరెక్టర్ అల్లు అర్జున్ తోనూ సినిమా తీయబోతున్నాడు. ఈ విషయాన్ని బుధవారం (జులై 2) ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి కన్ఫమ్ చేశాడు.
ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రావణం అనే మూవీ రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ విషయాన్ని దిల్ రాజు కూడా ధృవీకరించాడు. తమ బ్యానర్లోనే ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశాడు.
తమ్ముడు మూవీ ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పట్టాలకు ఎక్కడానికి కొంత సమయం పడుతుందని, అయితే ఇది కచ్చితంగా ఉంటుందని మాత్రం దిల్ రాజు తేల్చి చెప్పాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ కన్ఫమ్ అయినా అది ఎప్పుడు అన్నది మాత్రం చెప్పడం కష్టం. ప్రస్తుతం ఇటు బన్నీ, అటు ప్రశాంత్ ఇద్దరూ బిజీగా ఉన్నారు. పుష్ప 2 తర్వాత బన్నీ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అతడు పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీతో ఓ మూవీ చేయబోతున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అటు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత సలార్ 2, కేజీఎఫ్ 3లాంటివి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే అది కచ్చితంగా ఉంటుందని దిల్ రాజు చెప్పడం మాత్రం అభిమానులకు ఊరటనిచ్చేదే.
ఇక ప్రస్తుతం దిల్ రాజు తన నెక్ట్స్ మూవీ తమ్ముడు ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. నితిన్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే శుక్రవారం (జులై 4) థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. రూ.75 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు.
ఇందులో లయ కూడా చాలా రోజుల తర్వాత నటిస్తోంది. ఈ సినిమాపై దిల్ రాజు భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అందుకు తగినట్లు మూవీని తెగ ప్రమోట్ చేస్తున్నాడు. అటు నితిన్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.
సంబంధిత కథనం