Allu Arjun Sandeep Vanga Movie: అఫీషియ‌ల్ - అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడితో అల్లు అర్జున్ పాన్ ఇండియ‌న్ సినిమా-allu arjun join hands with director sandeep vanga for pan indian movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun Join Hands With Director Sandeep Vanga For Pan Indian Movie

Allu Arjun Sandeep Vanga Movie: అఫీషియ‌ల్ - అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడితో అల్లు అర్జున్ పాన్ ఇండియ‌న్ సినిమా

Nelki Naresh Kumar HT Telugu
Mar 03, 2023 08:11 AM IST

Allu Arjun Sandeep Vanga Movie: అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. శుక్ర‌వారం ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

అల్లు అర్జున్‌, సందీప్ వంగా
అల్లు అర్జున్‌, సందీప్ వంగా

Allu Arjun Sandeep Vanga Movie: టాలీవుడ్‌లో మ‌రో కొత్త కాంబినేష‌న్‌సెట్ అయ్యింది. స్టార్ హీరో అల్లు అర్జున్‌తో అర్జున్‌రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా సినిమా చేయ‌బోతున్నాడు. శుక్ర‌వారం ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ పాన్ ఇండియ‌న్ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ నిర్మించ‌బోతున్న‌ది.

అనౌన్స్‌మెంట్‌తోనేకొత్త కాంబినేష‌న్ పై టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియ‌న్ స్థాయిలో క్రేజ్ ఏర్ప‌డింది. భూష‌ణ్ కుమార్‌తో క‌లిసి ప్ర‌ణ‌య్ వంగా ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న 23వ సినిమా ఇది కావ‌డం గ‌మ‌నార్హం.

బాలీవుడ్‌లో యానిమ‌ల్‌

అర్జున్‌రెడ్డి తో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశాడు సందీప్ వంగా. బోల్డ్ ల‌వ్ స్టోరీగారూపొందిన ఈ సినిమా క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమాను క‌బీర్‌సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేసి పెద్ద విజ‌యాన్ని అందుకున్నాడుసందీప్ వంగా . ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ర‌ణ్‌భీర్ క‌పూర్‌తో యానిమ‌ల్ సినిమా చేస్తోన్నాడు సందీప్ వంగా. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది.

మ‌రోవైపు ప్ర‌భాస్‌తో స్పిరిట్ అనే సినిమాను ప్ర‌క‌టించాడు సందీప్ వంగా. పోలీస్ ఆఫీస‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ పాన్ ఇండియ‌న్ సినిమా ఈ ఏడాది సెట్స్‌ఫైకిరానున్న‌ట్లు స‌మాచారం. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప -2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సీక్వెల్‌కు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

IPL_Entry_Point