Pushpa 2 Record: ఫస్ట్ లుక్‍తోనే ‘పుష్ప 2’ నేషనల్ రికార్డ్: వివరాలివే-allu arjun first look from pushpa 2 creates national record on instagram check details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Record: ఫస్ట్ లుక్‍తోనే ‘పుష్ప 2’ నేషనల్ రికార్డ్: వివరాలివే

Pushpa 2 Record: ఫస్ట్ లుక్‍తోనే ‘పుష్ప 2’ నేషనల్ రికార్డ్: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 12, 2023 09:55 PM IST

Pushpa 2 Record: ‘పుష్ప 2: ది రూల్’ సినిమా నుంచి వచ్చిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ నేషనల్ రికార్డు సాధించింది. ఈ వివరాలను చిత్ర యూనిట్ నేడు వెల్లడించింది.

Pushpa 2 Record: ఫస్ట్ లుక్‍తోనే ‘పుష్ప 2’ నేషనల్ రికార్డ్: వివరాలివే
Pushpa 2 Record: ఫస్ట్ లుక్‍తోనే ‘పుష్ప 2’ నేషనల్ రికార్డ్: వివరాలివే

Pushpa 2 Record: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2 : ది రూల్’ సినిమాపై ఫుల్ క్రేజ్ ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ సహా దేశమంతా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 2021లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ‘పుష్ప 1: ది రైజ్’కు సీక్వెల్‍గా పుష్ప 2: ది రూల్ తెరకెక్కుతోంది. భారీ అంచనాలు ఉండటంతో దర్శకుడు సుకుమార్ ఈ రెండో పార్ట్‌ను మరింత భారీగా, చాలా జాగ్రత్తలతో రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలో ‘పుష్ప 2: ది రూల్’ సినిమాపై దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో మరోసారి నిరూపితమైంది.

yearly horoscope entry point

‘పుష్ప 2: ది రూల్’ చిత్రం నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 7న చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు కావటంతో ఒకరోజు ముందుగానే ఈ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో అమ్మవారిలా అలంకరణతో అల్లు అర్జున్ కనిపించారు. చీర, ఆభరణాలు, గాజులు, నిమ్మకాయల దండ, పూల దండ ధరించిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విభిన్నంగా ఉంది. దీంతో పుష్ప 2 నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా వైరల్ అయింది. అప్పటికే ఈ చిత్రంపై ఫుల్ క్రేజ్ ఉండగా.. ఈ ఫస్ట్ లుక్ మరింత ఆకట్టుకుంది. దీంతో భారీ రెస్పాన్స్ వచ్చింది.

పుష్ప 2 నుంచి వచ్చిన ఈ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఏకంగా ఇప్పుడు నేషనల్ వైడ్ రికార్డు సృష్టించింది. ఇన్‍స్టాగ్రామ్‍లో 7 మిలియన్ లైక్స్ దక్కించుకున్న తొలి భారతీయ మూవీ పోస్టర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ నేడు వెల్లడించింది. ఇప్పటి వరకు బాలీవుడ్ చిత్రాలకు కూడా ఇది సాధ్యం కాలేదు. దీంతో ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే నేషనల్ రికార్డు సాధించి క్రేజ్ ఎంత విపరీతంగా ఉందో నిరూపించుకుంది పుష్ప 2: ది రూల్ సినిమా. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అల్లు అర్జున్ ఏప్రిల్ 7న తన ఇన్‍స్టాగ్రామ్‍ అకౌంట్‍లో పోస్ట్ చేశారు. అదే ఈ నేషనల్ రికార్డు సాధించింది.

మరోవైపు, ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకు సంబంధించి అప్‍డేట్లు ఇవ్వాలంటూ కొంతకాలంగా అల్లు అర్జున్ అభిమానులు చిత్ర యూనిట్‍ను డిమాండ్ చేస్తున్నారు.

పుష్ప 2: ది రూల్ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తోంది. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

Whats_app_banner