Allu Arjun Fans: అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ.. యూట్యూబ్ ఛానెల్‌పై దాడి.. ఏం జరిగిందంటే?
Allu Arjun Fans: అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఓ యూట్యూబ్ ఛానెల్ పై వాళ్లు దాడి చేసిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. తమ అభిమాన హీరోపై పదే పదే నెగటివ్ వార్తలు ఇవ్వడంతో అభిమానులు అసహనంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది.
Allu Arjun Fans: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు సహనం కోల్పోయారు. బన్నీపై నెగటివ్ వార్తలు ప్రసారం చేయడంతోపాటు తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి పరువు తీస్తున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ పై దాడికి పాల్పడటం గమనార్హం. ఇప్పుడీ వార్త టాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. గతంలోనే ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్.. ఇప్పుడు ఏకంగా దాడికి దిగారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు హైదరాబాద్ లోని ఓ యూట్యూబ్ ఛానెల్ పై దాడికి పాల్పడినట్లు సమాచారం. తమ అభిమాన నటుడిపై పదే పదే తప్పుడు వార్తలను ఈ ఛానెల్ స్ట్రీమింగ్ చేస్తుండటంతో ఈ స్టార్ హీరో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కొన్నిసార్లు హెచ్చరించగా.. ఇక ఇప్పుడు ఏకంగా దాడికే దిగారు. బన్నీపై ఉద్దేశపూర్వకంగా తప్పు థంబ్‌నెయిల్స్ పెట్టి నెగటివ్ వార్తలు ఇస్తుండటంతో వాళ్లు ఈ పని చేసినట్లు తెలిసింది.
అల్లు అర్జున్ వర్సెస్ వరుణ్ తేజ్
మరోవైపు ఇప్పటికే అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల నుంచి ఈ హీరోలతోపాటు వాళ్ల ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా మట్కా మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ తేజ్ కూడా పరోక్షంగా అల్లు అర్జున్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసినట్లు భావిస్తున్నారు.
తమ ఎదుగుదలకు కారణమైన వాళ్లను మరిచిపోతే వాళ్ల సక్సెస్ ఎందుకూ పనికిరాదని వరుణ్ తేజ్ అనడంతో అది బన్నీని ఉద్దేశించే అన్నట్లు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. లైఫ్ లో పెద్దోడివి అయినా, కాకపోయినా ఎక్కడి నుంచి వచ్చావన్న విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలని కూడా వరుణ్ అన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా యూట్యూబ్ ఛానెల్ పై దాడికి దిగడం చర్చనీయాంశమవుతోంది.
అటు బన్నీ మాత్రం ఇవేమీ పట్టనట్లు తన నెక్ట్స్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే మూవీ ప్రమోషన్లను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సినిమా రిలీజ్ ను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు.