Allu Arjun: వయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ 25 లక్షల విరాళం
Allu Arjun: వయనాడ్ ప్రమాద బాధితులను ఆదుకునేందుకు అల్లు అర్జున్ ముందుకొచ్చాడు. 25 లక్షల విరాళం ప్రకటించాడు. అల్లు అర్జున్ మంచి మనసుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తోన్నారు.
Allu Arjun: వయనాడ్ కొండచరియల ప్రమాద బాధితుల కోసం అల్లు అర్జున్ విరాళం ప్రకటించారు. కేరళ సీఏం రిలీఫ్ ఫండ్‌ను 25 లక్షల అందజేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అల్లు అర్జున్ ఈ విషయాన్ని వెల్లడించాడు. వయనాడ్ ప్రమాద ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని అల్లు అర్జున్ అన్నాడు.
కేరళ ప్రజలు తనపై ఎంతగానో ప్రేమ, అభిమానులను చూపించారని, కష్టసమయంలో తన వంతుగా ప్రమాధ బాధితుల పునరావాసం కోసం 25 లక్షల రూపాయల్ని కేరళ సీఏం రీలిఫ్ ఫండ్‌కు విరాళంగా అందజేస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించాడు.
కేరళలో ఫ్యాన్ ఫాలోయింగ్...
అల్లు అర్జున్ మంచి మనసుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తోన్నాడు. అతడి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్‌కు కేరళలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడు హీరోగా నటించిన పుష్ప, ఆర్యతో పాటు పలు తెలుగు సినిమాలు మలయాళంతో డబ్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టాయి.
మోహన్ లాల్ మూడు కోట్లు...
వయనాడ్ బాధితులకు సహాయం అందించేందుకు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, మాలీవుడ్ హీరోలందరూ ఒక్కొక్కరుగా ముందుకొస్తోన్నారు. బాధితుల సహాయార్థం మోహన్ లాల్ మూడు కోట్లు, రష్మిక మందన్న 10 లక్షలు, సూర్య - జ్యోతిక - కార్తీ కలిసి 50 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ 35 లక్షలు అందించారు.
వీరితో పాటు నయనతార - విఘ్నేష్ శివన్ 20 లక్షలు, ఫహాద్ పాజిల్ - నజ్రియా 25 లక్షలు సాయం చేశారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో జూలై 30న కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 300లకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. 200ల వరకు గల్లంతు అయ్యారు.
పుష్ప 2తో బిజీ...
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో హీరోగా నటిస్తోన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 6న రిలీజ్ కాబోతోంది. తొలుత ఈ మూవీని ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ షూటింగ్ డిలే కావడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో సినిమా వాయిదాపడింది.
పుష్ప 2 మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. పుష్ప 2 దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నాడు అల్లు అర్జున్. గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలొచ్చాయి.
టాపిక్