Desamuduru Re Release Date: రీ రిలీజ్‌కు సిద్ధమైన బన్నీ బ్లాక్‌బస్టర్ మూవీ - డేట్ ఫిక్స్
Desamuduru Re Release Date: రీ రిలీజ్ సినిమాల లిస్ట్‌లో దేశముదురు చేరబోతున్నది. అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు థియేటర్ల ద్వారా మరోసారి ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
Desamuduru Re Release Date: అల్లు అర్జున్‌కు(Allu Arjun) మాస్ ఇమేజ్‌ను తీసుకొచ్చిన సినిమాల్లో దేశముదురు ఒకటి. ఆర్య, హ్యాపీ వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించిన బన్నీని దేశముదురు సినిమాతో కంప్లీట్ మాస్ హీరోగా ఆవిష్కరించారు దర్శకుడు పూరి జగన్నాథ్.
2007లో రిలీజైన ఈ సినిమాలో బన్నీ హీరోయిజం, అతడి డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. బన్నీ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో ఒకటైన దేశముదురు సినిమా మరోసారి థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. 4కే టెక్నాలజీలో దేశముదురు రీ రిలీజ్ కానుంది.
రీ రిలీజ్ ట్రెండ్ మొదలైన తర్వాత ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్‌బాబుతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. కానీ అల్లు అర్జున్ సినిమాలు మాత్రం ఒక్కటి కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దేశముదురుతో రీ రిలీజ్ హీరోల జాబితాలో బన్నీ చేరనున్నాడు.
ఈ సినిమాతోనే హన్సిక టాలీవుడ్‌లోకిఎంట్రీ ఇచ్చింది. 2007లో 500లకుపైగా థియేటర్లలో విడుదలైన సినిమాగా దేశముదురు రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 175 రోజులకుపైగా ఆడిన ఈ సినిమా మలయాళంలో డబ్ చేయగా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.