Mukhya Gamanika Movie: అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా మారాడు. ముఖ్య గమనిక పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. ఫిబ్రవరి 23న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో విరాన్ ముత్తంశెట్టికి జోడీగా లావణ్య హీరోయిన్‌గా నటిస్తోంది. వేణు మురళీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ముఖ్య గమనిక ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ విరాన్ నేను జిమ్ ఫ్రెండ్స్ అని తెలిపాడు. మంచి బ్యాగ్రౌండ్ ఉన్న తన సొంత కష్టం మీద పైకి రావాలని కష్టపడుతున్నాడని విశ్వక్‌సేన్ చెప్పాడు. “కలిసి క్రికెట్ ఆడుకునేవాళ్లమని చెప్పాడు. విరాన్ హీరోగా నటించాల్సిన కొన్ని సినిమాలు ఆగిపోయాయని, ఆ అడ్డంకులను పట్టించుకోకుండా ముఖ్య గమనిక ఈ సినిమాతో అతడు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందని ”విశ్వక్ సేన్ అన్నాడు.
ఎల్లప్పుడూ నా వెనకే ఉండి అల్లు అర్జున్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారని విరాన్ ముత్తంశెట్టి అన్నాడు. నాకు ఇష్టమైన కజిన్స్‌లో అల్లు శిరీష్ ఒకరు. వారిద్దరి వల్లే హీరోనయ్యానని విరాన్ తెలిపాడు. విశ్వక్ సేన్ గురించి టాలీవుడ్‌లో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.
“విశ్వక్ సేన్ మాట ఇవ్వడు. ఇస్తే ఖచ్చితంగా నిలబడతాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకొని నా కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడు. అతడికి జీవితాంతం రుణపడి ఉంటాను. కొత్తవాళ్లం కలిసి చేసిన చేసిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని” విరాన్ ముత్తంశెట్టి కోరాడు. సినిమా నచ్చితేనే సినిమా చూడండి. ఫెయిలయితే థియేటర్లకు రావొద్దు అని విరాన్ ముత్తం శెట్టి తెలిపాడు.
లవ్ డ్రామా సస్పెన్స్ అంశాలతో ఈ మూవీ తెరకెక్కుతోందని, మంచి మూవీతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని లావణ్య చెప్పింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నామని, హీరోగా విరాన్‌కు మంచి పేరు తెచ్చిపెడుతుందని డైరెక్టర్ అన్నాడు.
నిర్మాతగా నేను ఈ స్థాయికి చేరుకోవడానికి 17 ఏళ్లు పైనే పట్టిందని, ఈ సినిమా టీమ్‌ను చూస్తుంటే అప్పటి రోజులు గుర్తొచ్చాయని బన్నీ వాసు చెప్పాడు. శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్, సాయి కృష్ణ ముఖ్య గమనిక మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కథలను వినే వ్యక్తుల్లో విరాన్ ఒకడు అని బన్నీ వాసు చెప్పాడు. ఈ వేడుకకు నేను వెళుతున్నానని తెలియగానే అల్లు అర్జున్ హ్యాపీగా ఫీలయ్యాడని బన్నీ వాసు చెప్పాడు.
ముఖ్య గమనిక సినిమాకు కిరణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్, సాయి కృష్ణ ముఖ్యగమనిక సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 23న ముఖ్యగమనికతో పాటు మరో ఆరు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సుందరం మాస్టర్, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా, సిద్ధార్థ్ రాయ్, భ్రమయుగం, సైరన్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ముఖ్య గమనిక పోటీపడుతోంది.